నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : నిజామాబాద్‌లో ఉగ్ర కలకలం రేపుతోంది. బోధన్ పట్టణంలో మహమ్మద్ ఉజైఫా యమాన్ అనే అనుమానిత ఉగ్రవాదిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రదర్యాప్తు సంస్థలు ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న హషన్ డ్యానిష్‌ను అరెస్ట్ చేశాయి. అయితే డ్యానిష్ ఇచ్చిన సమాచారంతో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా ఎమన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్‌పై ఢిల్లీకి తరలించారు. నిందితుడి నుంచి ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా, యామన్.. బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నట్లు ఎన్‌ఐఏ సోదాల్లో తేలింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.