ప్రజలకిచ్చిన హామీలపై స్పష్టత ఏదీ?

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: గవర్నర్ ప్రసంగంలో ప్రజలకు ఇచ్చిన హామీల గురిం చి ఎలాంటి ప్రస్తావన లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రైతుల ఇబ్బం దులు, ఉద్యోగాల భర్తీ గురించి లేదని, ఉద్యో గుల సమస్యలపై ప్రస్తావించలేదని తెలిపారు. ప్రపం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీజేపీ ఎమ్మె ల్యే పాయల్ శంకర్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ… విశ్రాంత ఉద్యోగులు గోస ప డుతున్నారని… ఎన్నేళ్లు అయినా వారికి బెనిఫి ట్స్ అందడం లేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల కు సంబంధించిన చట్టాలు ఉన్నప్పటికీ వారికి అందాల్సిన సౌకర్యాలు అందడం లేదని ఎమ్మె ల్యే విమర్శించారు. బీసీలను పూర్తిగా మోసం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశా రు. సబ్ ప్లాన్ ముచ్చటే లేదన్నారు. ప్రభుత్వ అప్పులపై స్పష్టత లేదని తెలిపారు. గవర్నర్తో ప్రభుత్వం ఏదైనా మాట్లాడించేటప్పుడు ఆలో చించాలని.. అన్నీ అవాస్తవాలు, గందరగోళ మైన మాటలు మాట్లాడించారని బీజేపీ ఎమ్మె ల్యే ఆరోపించారు. సెంబ్లీలో తెలంగాణ గేయం తర్వాత వందే మాతరం గేయాన్ని ఆలపించకుండా ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని అవమానించారని మండిపడ్డారు. ఎంఐఎం ఎమ్మెల్యేల తీరు సిగ్గుచేటన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *