వందేమాత‌రంపై చ‌ర్చ అవ‌స‌ర‌మా?

“స్వాతంత్య్ర స‌మ‌రం కాలంలో ర‌చించిన ఈ గీతంపై చ‌ర్చ‌ను కొన‌సాగిస్తూ విలువైన పార్ల‌మెంట్ స‌మ‌యాన్ని వృధా చేయ‌డం ఎంత‌వ‌ర‌కు సమంజ‌స మన్నది కీల‌క ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఇండిగో సంక్షోభం, దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వాయుకాలుష్యం, రూపాయి విలువ ప‌డిపోవ‌డం, నిరుద్యోగం వంటి ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఒక్క‌ప‌క్క ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్న స‌మ‌యంలో, కేవ‌లం రాజ‌కీయ కార‌ణాల‌కోసం వందేమాత‌రంపై చ‌ర్చ‌ను కొన‌సాగించడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం?”

ప్ర‌జ‌ల‌ను చెడ‌గొట్టాల‌న్నా లేక‌ ధ్రువాత్మకంగా మార్చాల‌న్నా ఒకే ఒక్క మార్గం చ‌రిత్ర‌ను, ఉమ్మ‌డి గుర్తింపును, సంప్ర‌దాయాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా  ఖండించ‌డం లేదా వాటిపై అస్ప‌ష్ట‌త‌ను సృష్టించ‌డం. ఆవిధంగా వారిలోని జ్ఞాప‌కాల‌ను చెరిపేయ‌డం. ఒక స‌మాజం గ‌తంలో ప‌డిన క‌ష్టాలు, సాధించిన విజ‌యాలనుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చ‌డం ద్వారా, ప్ర‌స్తుతం వారు ఎదుర్కొంటున్న అన్యాయాల‌ను స‌మైక్యంగా ఎదుర్కొనే సామ‌ర్థ్యాల‌ను దెబ్బ‌తీసే విధానానికి సంబంధించి వివ‌రించే అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాఖ్య ఇది. ఆవిధంగా  ఉమ్మ‌డి తిరుగుబాటు స్ఫూర్తి దెబ్బ‌తిన్న ప్ర‌జ‌లు నిస్తేజంగా ఉండిపోతారు. ప్ర‌జ‌ల‌ చ‌రిత్ర‌ను ఖండించాలంటే, దాన్ని తొల‌గించేంత‌టి బ‌లీయ‌మైన మ‌రో వివ‌ర‌ణ ఉండి తీరాలి. ఆ విధంగా సృష్టించిన‌ స‌రికొత్త నిజం అధికార గ‌తిశీల‌త‌ను నిర్దేశిస్తుంది. ఆవిధంగా త‌ప్పుడు వ్యాఖ్యానాన్ని నియంత్రిస్తున్న‌వారి వైపున‌కు ప్ర‌జ‌ల విధేయత  మారిపోతుంది.

గ‌త చ‌రిత్ర‌లోని త‌ప్పిదాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఎత్తిచూపే ప్ర‌క్రియ‌లో  ప్ర‌జ‌ల చ‌రిత్రను ప‌క్క‌దోవ‌ ప‌ట్టించ‌డం ద్వారా నాయ‌కులు, ప్ర‌త్య‌ర్థులు త‌మ ఆధిప‌త్యాన్ని లేదా అధికారాన్ని సుసంఘ‌టితం చేసుకోవ‌డం వెన‌క‌టి కాలంనుంచీ జ‌రుగుతున్న చ‌రిత్రే! 1867లో ర‌ష్యాకు చెందిన‌ రెండ‌వ జార్ అల‌గ్జాండ‌ర్ అలాస్కా ప్రాంతాన్ని అమెరికాకు 7.2మిలియ‌న్ డాల‌ర్ల‌కు అమ్మేశాడు! అప్ప‌ట్లో ఆయ‌న ఈ భూభాగాన్ని ఎంత‌మాత్రం ఉత్ప‌త్తికి ప‌నికిరాని, ఎల్ల‌ప్పుడూ మంచు గ‌డ్డ‌క‌ట్టి ఉండే  వ్య‌ర్థ భూమి అని భావిం చ‌డ‌మే అందుకు కార‌ణం. త‌ర్వాతి కాలంలో ఇదే భూమిలో పెద్ద మొత్తంలో బంగారం, విస్తారంగా చ‌మురు నిల్వ‌లు ఉన్న‌ట్లు తేలడంతో ఆర్థికంగా ఎంత‌టి లాభ‌సాటి ప్రాంత‌మో తెలిసొచ్చింది. దీంతో ఆవిధంగా ఈ ప్రాంతాన్ని అమ్మేయ‌డం దారుణ‌మైన త‌ప్పిద‌మ‌ని ర‌ష్యాకు చెందిన త‌ర్వాతి కాల‌పు చ‌రిత్ర‌కారులు అభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌డం మొద‌లుపెట్టారు. ముఖ్యంగా  వ్య‌ర్థంగా భావించి ఇంత‌టి విలువైన ప్రాంతాన్ని యు.ఎస్‌.కు త‌క్కువ ధ‌ర‌కే క‌ట్ట‌బెట్ట‌డంపై పూర్వ పాల‌కుల‌పై ర‌ష్యాకు చెందిన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌ల దాడికి దిగ‌డం కొన‌సాగుతూనే ఉంది . స‌రిగ్గా ఇదేమాదిరి ప‌రిస్థితి ప్ర‌స్తుతం మ‌న‌దేశం లో కూడా క‌నిపిస్తోంది.
ముఖ్యంగా జాతీయ గానం వందేమాత‌రం ర‌చించి 150 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా పార్ల‌మెంట్‌లో గ‌త 12 గంట‌ల‌నుంచి కొన‌సాగుతున్న చ‌ర్చ‌, అధికార, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య వాడివేడిగా కొన‌సాగుతుండ‌టం గ‌మ‌నార్హం. స్వాతంత్య్ర స‌మ‌రం కాలంలో ర‌చించిన ఈ గీతంపై చ‌ర్చ‌ను కొన‌సాగిస్తూ విలువైన పార్ల‌మెంట్ స‌మ‌యాన్ని వృధా చేయ‌డం ఎంత‌వ‌ర‌కు సమంజ‌స మన్నది కీల‌క ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం ఇండిగో సంక్షోభం, దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వాయుకాలుష్యం, రూపాయి విలువ ప‌డిపోవ‌డం వంటి ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఒక్క‌ప‌క్క ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్న స‌మ‌యంలో, కేవ‌లం రాజ‌కీయ కార‌ణాల‌కోసం వందేమాత‌రంపై చ‌ర్చ‌ను కొన‌సాగించడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం? ఈ చ‌ర్చ స‌మైక్య నిర్ణ‌యానికి బదులు రాజ‌కీయ‌, సైద్ధాంతిక విభేదాల వైపున‌కు మ‌ళ్ల‌డం మ‌రో విచిత్రం!
“ఇప్ప‌టికే మ‌త‌ప‌రంగా దేశంలో కొన‌సాగుతున్న విభేదాల నేప‌థ్యంలో, బీజేపీ ప్ర‌భుత్వం దేశ స‌మైక్య‌త అనే పేరుతో త‌న క‌ప‌ట‌బుద్ధిని మ‌రోమారు బ‌య‌ట‌పెట్టుకున్న‌ది. నిజం చెప్పాలంటే 1937లో నాటి కాంగ్రెస్ నాయ‌కులు దేశ స‌మైక్య‌త‌, మ‌త‌సామ‌ర‌స్యం విష‌యంలో బాగా ఆలోచించి బ‌హుళ సామాజిక వ్య‌వ‌స్థ‌ను నిల‌పాలన్న ఉద్దేశంతో తీసుకున్న స‌ముచిత నిర్ణ‌యం ఇది. వందేమాత‌రం పేరుతో హ‌డావిడి చేస్తున్న నేటి బీజేపీ వ్య‌వ‌స్థాప‌కులెవ‌రూ నాటి స్వాంతంత్య్ర స‌మ‌రంలో పాల్గొన‌లేద‌న్న సంగ‌తి మ‌రువ‌రాదు. అంతేకాదు మెజారిటీల గుర్తింపు, నాటి రాజ‌కీయ వైరుధ్యాల లెక్క స‌రిచూసుకునే చ‌ర్య త‌ప్ప మ‌రోటికాదు. ఎప్పుడో ప‌రిష్కృత‌మైన ఈ స‌మ‌స్య‌ను మ‌ళ్లీమ‌ళ్లీ లేవ‌నెత్త‌డం ద్వారా దేశంలో మ‌త భావ‌న‌ల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తూ, జాతి స‌మైక్య‌త‌ను దెబ్బ‌తీసే చ‌ర్యగా దీన్ని భావించాలి.”
ఈ గీతంలోని కొన్ని చ‌ర‌ణాల‌ను అప్ప‌ట్లో కాంగ్రెస్ కేవ‌లం బుజ్జ‌గింపు చ‌ర్య‌ల్లో భాగంగా తొల‌గించింద‌ని అధికార పార్టీ ఆరోపిస్తే, ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న నిరుద్యోగం, అస‌మాన‌త‌లు, వోట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌ల‌పై చ‌ర్చ జ‌ర‌ప‌కుండా ప్ర‌భుత్వం త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ద‌ని విప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. వందేమాత‌రం గీతాన్ని ఒక‌వైపు, స్వాతంత్య్రోద్య‌మ కాలంలో దేశంలో స‌మైక్య‌తా సాధ‌న‌కోసం ఉప‌యోగించిన ఒక నినాదంగా పేర్కొంటూ, మ‌రోవైపు నాటి నాయ‌కులు ఒత్తిళ్ల‌కు లొంగి ఈ గీతానికి అన్యాయం చేశారంటూ అధికారప‌క్షం వాదించ‌డం కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కోసం, స‌మాజాన్ని మ‌రింత ధ్రువాత్మ‌కత వైపు మ‌ళ్లించే య‌త్నం త‌ప్ప మ‌రోటి కాదు. అంతేకాదు చ‌రిత్ర‌ను ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం త‌మ‌కు అనుకూల‌మైన రీతిలో మ‌ల‌చి, వ‌ర్త‌మాన రాజ‌కీయ ల‌క్ష్యాల‌ను సాధించ‌డ‌మే అధికార ప‌క్ష ప్ర‌ధాన ఉద్దేశంగా క‌నిపిస్తోంది.
స్వాతంత్య్రోద్య‌మ కాలంలో వందేమాత‌రం గీతం బ్రిటిష్ పాల‌కుల‌కు వ్య‌తిరేకంగా పోరాటోన్ముఖుల‌ను చేయ‌డానికి ఎంత‌టి శ‌క్తివంత‌మైన ఆయుధంగా ఉప‌యోగ‌పడిందీ వివ‌రించాల్సింది పోయి, నాటి కాంగ్రెస్ ప్ర‌ధానంగా నెహ్రూ 1937లో  ఏవిధంగా ఈ గీతంలోని చ‌ర‌ణాల‌ను కుదించార‌నే దానిపై విప‌క్షంపై దాడికి దిగ‌డం కేవ‌లం ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చ‌డానికి త‌ప్ప మ‌రోటి కాదు. అయితే స‌ద‌రు చ‌ర‌ణాల‌ను తొల‌గించే ముందు ర‌వీంద్ర‌నాథ్ టాగోర్ , మ‌హాత్మాగాంధీల‌ను నెహ్రూ సంప్ర‌దించార‌న్న సంగ‌తిని ప్ర‌ధాని చెప్ప‌డంలేదు. తొల‌గించిన చ‌ర‌ణాలు, మెజారిటీ హిందువుల‌కు అనుగుణంగా, ముస్లిం వ‌ర్గాలను విస్మ‌రించేవిగా ఉండటం  వ‌ల్ల నాటి ప‌రిస్థితుల్లో స‌మైక్య ఉద్య‌మాన్ని దృష్టిలో ఉంచుకొని వారు ఆ విధ‌మైన నిర్ణ‌యాన్ని తీసుకొనిఉండవ‌చ్చు.
1937లో తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని  “లొంగిపోవ‌డం ” లేదా  “ప్ర‌జ‌ల‌ను విడ‌గొట్టే చ‌ర్య‌గా ” చూప‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్నది. ముఖ్యంగా పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలాపించ‌డం ప‌రిశుద్ధ దేశ‌భ‌క్తిగా,  తొల‌గించిన చ‌ర‌ణాల‌తో ఉన్న  గీతాన్ని ఆల‌పించ‌డం  “బుజ్జ‌గింపు చ‌ర్య‌” గా  బీజేపీ ఎత్తి చూపుతున్న‌ది. ముఖ్యంగా అంద‌రికీ క‌లుపుకొని ముందుకెళ్లాల‌న్న స్ఫూర్తితో తీసుకున్న నాటి సంక్లిష్ట చారిత్ర‌క‌ నిర్ణ‌యాన్ని ద్రోహంగా చిత్రీక‌రించే య‌త్నం చేస్తున్న‌ది. రాజ‌కీయ కార‌ణాల‌తో పార్ల‌మెంట్ వేదిక‌గా చ‌ర్చించ‌డం జాతీయాభిమా నాన్ని క్ర‌మంగా “హిందూత్వ జాతీయవాదం” వైపున‌కు మ‌ర‌ల్యే య‌త్నం త‌ప్ప మ‌రోటికాదు. వ్య‌క్తిగ‌త జాతీయ వాదాన్ని ప్ర‌ధానంగా మైనారిటీల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌యోగించ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.
ఇప్ప‌టికే మ‌త‌ప‌రంగా దేశంలో కొన‌సాగుతున్న విభేదాల నేప‌థ్యంలో, బీజేపీ ప్ర‌భుత్వం దేశ స‌మైక్య‌త అనే పేరుతో త‌న క‌ప‌ట‌బుద్ధిని మ‌రోమారు బ‌య‌ట‌పెట్టుకున్న‌ది. నిజం చెప్పాలంటే 1937లో నాటి కాంగ్రెస్ నాయ‌కులు దేశ స‌మైక్య‌త‌, మ‌త‌సామ‌ర‌స్యం విష‌యంలో బాగా ఆలోచించి బ‌హుళ సామాజిక వ్య‌వ‌స్థ‌ను నిల‌పాలన్న ఉద్దేశంతో తీసుకున్న స‌ముచిత నిర్ణ‌యం ఇది. వందేమాత‌రం పేరుతో హ‌డావిడి చేస్తున్న నేటి బీజేపీ వ్య‌వ‌స్థాప‌కులెవ‌రూ నాటి స్వాంతంత్య్ర స‌మ‌రంలో పాల్గొన‌లేద‌న్న సంగ‌తి మ‌రువ‌రాదు. అంతేకాదు మెజారిటీల గుర్తింపు, నాటి రాజ‌కీయ వైరుధ్యాల లెక్క స‌రిచూసుకునే చ‌ర్య త‌ప్ప మ‌రోటికాదు. ఎప్పుడో ప‌రిష్కృత‌మైన ఈ స‌మ‌స్య‌ను మ‌ళ్లీమ‌ళ్లీ లేవ‌నెత్త‌డం ద్వారా దేశంలో మ‌త భావ‌న‌ల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తూ, జాతి స‌మైక్య‌త‌ను దెబ్బ‌తీసే చ‌ర్యగా దీన్ని భావించాలి.
ఆ విధంగా 12గంట‌ల పార్ల‌మెం ట్‌లో జ‌రిగిన చ‌ర్చ నాటి సంక్లిష్ట ప‌రిస్థితుల నేప‌థ్యంలో తీసుకున్న‌ నిర్ణ‌యాన్ని స‌మ‌న్వ‌య‌ప‌ర‌చ‌డం  కాకుండా, వ్యూహాత్మ‌కంగా ప్ర‌జ‌ల్లో భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టి వాటిని త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవడానికే అధికార‌ప‌క్షం వ్య‌వ‌హ‌రిస్తోంది. వందేమాత‌రం గానానికున్న జాతీయ ప్రాధాన్య‌త విష‌యంలో ఎవ‌రికీ ఎటువంటి మ‌రో అభిప్రాయం లేదు. అయితే ఈ అంశాన్ని చ‌ర్చించ‌డానికి ఎంచుకున్న స‌మ‌య‌మే ప్ర‌శ్నార్థ‌కం. ఎందుకంటే ఈ చ‌ర్చ దేశ స‌మైక్య‌త కంటే, ఈ గీతం విష‌యంలో జ‌రిగిన చారిత్రక సంఘ‌ట‌న‌ల‌ను మ‌సిపూసి మారేడుకాయ చేసి రాజకీయ ప్ర‌యోజ‌నం సాధించే ల‌క్ష్యంతోనే కొన‌సాగింది. అదీకాకుండా నేటి అధికార పార్టీకి చెందిన పూర్వీకులెవ్వ‌రూ స్వాతంత్య్రోద్య‌మంలో పాల్గొన‌లేద‌న్న‌ది గుర్తుంచుకోవాలి. అందువ‌ల్ల ప్ర‌భుత్వ వైఫల్యాల‌నుంచి దృష్టి మ‌ర‌ల్చేందుకే ఈ చ‌ర్చ ఉప‌యోగ‌ప‌డింది త‌ప్ప మ‌రో ప్ర‌యోజ‌నం వొన‌గూడ‌లేద‌న్న‌ది మాత్రం అక్ష‌ర‌స‌త్యం!
-శామ్ సుందర్ 
పొలిటికల్ అనలిస్ట్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *