“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెడ్ బుక్ పేరుతో దాడులు, కేసులు ముదిరి చివరకు “ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు” కొందరు సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడి, వేటాడి మరీ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ లను తప్పుపట్టడమేకాక సోషల్ మీడియాభావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోరాదని స్పష్టంగా చెప్పింది. దీనితో కాస్తా వెనక్కు తగ్గిన చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు వివాదం తర్వాత తమప్రభుత్వ ప్రతిష్ట ఒకింత దిగజారడానికి సోషల్ మీడియా నే ప్రధానకారణం అని నిర్థారణకు వచ్చినట్లు కనిపిస్తోంది.,”

(సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త)
మొబైల్ :9441864414.ఇమెయిల్: thirmal.1960@gmail.com
తెలంగాణా అసెంబ్లీ సమావేశాల్లో “తెలంగాణాహేట్ స్పీచ్ &హేట్ క్రైమ్ “బిల్లును ప్రతిపాదించారు. ఇదిన్యాయస్థానం సమీక్షలో నిలబడుతుందా? లేదా? అనేది తదుపరిఅంశం.దీనిపై ప్రతిపక్ష,అధికార పక్షం సభ్యులు పలు అనుమానాలు, సమస్యలు లేవనెత్తారు.దానివలన బిల్లు సెలెక్ట్ కమిటీ కి పరిశీలన నిమిత్తం పంపనైనది.బిల్లు ఆమోదం పొందితే, రాజ్యాంగం లోని ఆర్టికల్ 19(1)ఏ ద్వారా భావప్రకటనా స్వేచ్ఛ కు బిల్లు విరుద్ధం అయినదిగా ప్రతిపక్షాలు విమర్శించాయి.ఈబిల్లు ఆమోదం పొంది ఉంటే దేశంలో వివిధ ప్రభుత్వాలకు ఒక అప్రజాస్వామిక ఆయుధం అందించినట్లు అయ్యోది.ఒకరకంగా బిల్లు ప్రతిపాదన కు ప్రేరణ ఏమిటి ఆలోచన చేస్తే దాని మూలాలు కొంత వరకు ఆంధ్రలో కూడా దొరుకుతాయి.తిరుపతి లడ్డు వ్యవహారం లో నారాచంద్రబాబు నాయుడు బూమరాంగ్ కావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా! ప్రధాన మీడియా మద్దతు దండిగా ఉన్నప్పటికీ,సిబిఐ చార్జి షీట్ తర్వాత బోలేబాబా,ఇందాపూర్ వయా హెరిటేజ్ చర్చ సోషల్ మీడియా ఏరోజుకారోజు ఉక్కిరిబిక్కిరి చేసింది.ఆంధ్రప్రదేశ్ లో చట్ట సభలైన శాసనసభ,శాసనమండలి కంటే సోషల్ మీడియాలో జరిగిన చర్చ పైచేయి సాధించింది.వెనువెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ ఓ మీడియా అధినేతకు సంభంధించిన వీడియోలుచేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఈవిషయంలో ఒకానొక దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి మాట్లాడాలి అనే విషయం లో గందరగోళం కు గురైంది.చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోట సోషల్ మీడియా నిషేధం గురించి మాట బయటకు వచ్చింది.ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెడ్ బుక్ పేరుతో దాడులు, కేసులు ముదిరి చివరకు “ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు” కొందరు సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడి,వేటాడి మరీ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టారు.ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ లనుతప్పుపట్టడమేకాక సోషల్ మీడియాబావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోరాదని స్పష్టంగా చెప్పింది.దీనితో కాస్తా వెనక్కు తగ్గిన చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు వివాదం తర్వాత తమప్రభుత్వ ప్రతిష్ట ఒకింత దిగజారడానికి సోషల్ మీడియా నే ప్రధానకారణం అని నిర్థారణకు వచ్చినట్లు కనిపిస్తోంది.ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాను నిషేధం విధించాలనే ఆలోచనకు వచ్చారు.ఆవిషయం బహిరంగంగా మాట్లాడారు కూడా! సరిగ్గా చంద్రబాబు నాయుడు మాట్లాడిన వారం రోజులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓ సభలో మాట్లాడుతూ అచ్చం అదే ప్రకటన చేశారు.రేవంత్ రెడ్డి ప్రకటన యాదృచ్ఛికమా?లేక చంద్రబాబు నాయుడు కలిగించిన పరోక్ష ప్రేరణా?తెలియదు కానీ, గురుశిష్యుల నోటి నుండి ఒకేసారి సోషల్ మీడియా నిషేధం ,నియంత్రణ మాట బయటకు వచ్చింది.
రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి అసెంబ్లీ లోఏకంగా బిల్లును పెట్టారు. తెలంగాణా రాష్ట్రం లో నాగర్ కర్నూల్ జిల్లా లో పసి బాలుడు మరణంతో చెలరేగిన సోషల్ మీడియా ఖమ్మం వెలుగు మట్ల భూముల్లో పేదలకు గుడిసెలు తొలగింపు సంఘటనతో ఒకింత రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వంను ఇరకాటంలో పడేసింది.ఈ సంఘటనలో స్థానిక మంత్రులు,అధికారులకు వ్యూహం ఉండడం వలన ప్రధాన మీడియా అయిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను రెండు రకాలు గా నియంత్రణ చేశారు.ఒకటి ఏడు వందల ఇండ్లను కూలగొట్టి వెలుగు మట్ల భూదాన్ భూముల నుండి పేదలను తొలగించే సంఘటన వద్దకు మీడియాను భౌతికంగా అనుమతించకపోవడం ఒక ఎత్తయితే, అడ్డుపడతారనుకున్న సోషల్ మీడియా కార్యకర్తలను ఇతర జిల్లాల్లో అరెస్ట్ చేయడాన్ని బట్టి కేవలం ఇది స్థానిక మంత్రుల నిర్ణయం మాత్రమేకాదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయంఉందని అర్థం అయ్యింది. సంఘటనతర్వాత కూడా ప్రధాన మీడియాలో అధికారులు ప్రకటనలకే ప్రాదాన్యత ఇచ్చి ప్రచారం చేయడం రెండవ అంశం.ఎంత వ్యూహాత్మకంగా మీడియా నియంత్రణ చేసినా చేతిలో సెల్ పోన్ అనబడే సమాచార విప్లవం ముందు అవి వెలవెల పోయాయి.పెద్ద ఎత్తున పోలీసులు, రెవెన్యూ అధికారులు వెలుగు మట్ల భూదాన్ భూముల లో నిర్మించిన వినోబావే నవోదయ కాలనీలో గుడిసెలు కూల్చివేత సంఘటన,అక్కడ బీభత్సం,హృదయ విదారక దృశ్యాలు, ఏడుపులు, గగ్గోలు,ప్రతిఘటన అంతా రికార్డు అయి సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరిగింది.సోషల్ మీడియా అంటే ఒక్క యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు,ఫేస్ బుక్, వాట్సాప్,ప్రజల చేతిలో ఉన్న సెల్ పోన్ అని నిర్థారణ అయ్యింది.ప్రభుత్వం అక్కడ ఏది జరగకూడదని బావించిందో సరిగ్గా అదే జరిగింది.
ఇది ఒకరకంగా కాంగ్రెస్ ప్రతిష్టను తిరిగి కోలుకోలేనివిదంగా దెబ్బతీసింది.పేదల్లో ప్రభుత్వం పట్ల అసహనం కలగజేసింది.ఈ స్థితి లో రేవంత్ రెడ్డి కి సోషల్ మీడియాను నియంత్రణ చేయాలి,లేక నిషేధం విధించాలనే ఆలోచనలు రావడానికి కారణం కావచ్చను. గతంలో ఆయన మీడియా పై ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అసహనం వ్యక్తం చేయడంతో పాటు,వీపులు పగలగొట్ట బుద్ది అవుతుంది అనే వరకు ఓమాటతూలారు.ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియా నియంత్రణలేక నిషేధం దిశగా అడుగులు వేస్తున్నారు.సోషల్ మీడియా అనేది ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు పెంచి పోషించే పంజరం లో చీలికలే? ఆవిషయం రేవంత్ రెడ్డికి గాని ఇతర పక్షాలకు కానీ తెలియనిది కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ కు భిన్నంగా తెలంగాణా సోషల్ మీడియా స్వరూపం ఉంది.కేవలం అధికారం,ప్రతిపక్షాల మధ్య సోషల్ మీడియా విభజన రూపమే కాదు.ఇక్కడ తెలంగాణా ఉద్యమం స్ఫూర్తి తో పనిచేస్తున్న మధ్యే వాద,లేదా స్వతంత్ర సోషల్ మీడియా కూడా ఉంది.ఈ సోషల్ మీడియా అధికారంలో ఎవరు ఉన్నా జరిగిన భూదోపిడిపై ఎక్కువ కథనాలు ప్రసారం చేశారు.ఇదే మీడియా అనుకూల ప్రచారం ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి అధికారం లోకి రావడానికి ఎంతోకొంత తోడ్పడింది.ఇప్పుడు అధికారం మారిన తర్వాత అధికారపక్షం కు అదే మీడియా కంటిలో నలుసులా మారిపోయింది.
ఒకరకంగా సోషల్ మీడియాలో కాస్తా మర్యాద లోపించిన పదజాలం వాడడం సర్వ సాధారణమైంది.ప్రజలుకూడా ఇట్లాంటి పరుషమైన విమర్శలను రిసీవ్ చేసుకున్న విధంగా నిర్మాణాత్మక విమర్శలకు గుర్తింపు ఇవ్వడం లేదు.ఒకరకంగా సోషల్ మీడియా బాష ప్రత్యేకంగా స్థిరీకరించబడింది.దీనికి ఆజ్యం పోసింది కూడా రాజకీయ పక్షాలే? నిజంగా “తెలంగాణా హేట్స్ స్పీచ్ &హేట్ క్రైమ్ బిల్లు “ఎన్నికల ముందు , తర్వాత ఉండిఉంటే ఈ చట్టం క్రింద ప్రదాన శిక్షార్హులు కేసీఆర్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ లపైనే అత్యదిక కేసులు నమోదు చేయాల్సి వచ్చేది?ఎన్నికల సమయం లో పరిమితి కోల్పోయిన పదజాలం నాయకులు నోటినుండి వచ్చినప్పుడు,సోషల్ మీడియా అదే పరిభాష ను ఎన్నుకోవడంలో తప్పులేదు. ఒకరకంగా ‘నీవు నేర్పిన విద్యనే కదా నీరజాక్ష’అన్న విధంగా తయారైంది.తమదాకా వస్తే కాని తెలియదు అన్నట్లు అదికార పక్షాలు సోషల్ మీడియా నిషేధం లేదా నియంత్రణ అనబడే అంశంపై చర్చకు తెరలేపడం లో అంతరార్థం అదేకవచ్చును.అయితే పాలకులు ఎవరైనా భావాలను,భాషను,యాసను,సమాచార హక్కులను నియంత్రణ చేయాలనుకోవడం తమ పరిపాలన నిరంకుశ, నియంత్రృత్వపోకడలను, ఛాయలను కప్పిపుచ్చుకోవడం, లేదా పరోక్షంగా వ్యక్తం చేసుకోవడమే అవుతుంది.ఇదిఒకరకంగా పాలకుల షెల్ఫ్ గోల్ అనికూడా అనవచ్చు.
ఎన్.తిర్మల్(సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త) సెల్:9441864514, ఇమెయిల్: thirmal.1960@gmail.com





