– పూర్తిస్థాయిలో సంస్కరణలు చేపట్టాలి
– ఆధునిక పరిజ్ఞానాన్ని అమలులోకి తేవాలి
– టైం బౌండ్‌తో ప్రాజెక్టుల డిజైన్లు
– నీటిపారుదల శాఖలో ఉద్యోగాల భర్తీ
– డిజైన్ విభాగంలో పనిచేసే వారికీ పదోన్నతులు
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12: నీటిపారుదల శాఖ సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్ఠతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ ఉదంతంలో జాతీయ భద్రతా సంస్థతోపాటు జస్టిస్ ఘోష్ కమిషన్ చేసిన వ్యాఖ్యలతో సీడీవో ప్రతిష్ట దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యాఖ్యాలపై సీడీవో పునఃసమీక్షించుకుని సంస్కరణలు చేపట్టడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేెడ్కర్ సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన మంగళవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీ అంజద్ హుస్సేన్, రమేష్‌బాబులతో పాటు నీటిపారుదల శాఖాజాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస, సీడీవో సీఈ ఎం.సత్యనారాయణ రెడ్డి, సీఈలు అజయ్ కుమార్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ మారుతున్న కాలానికనుగుణంగా సీడీవోను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ముఖ్యంగా ప్రాజెక్టుల డిజైన్‌ల రూపకల్పనలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలన్నారు. అందుకు అవసరమైన లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ముందుండాలన్నారు. ఒకప్పుడు సీడీవో ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ భారత దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. వందేళ్ల క్రితం నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి మొదలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణాలలో వినియోగించిన సాంకేతికత తెలంగాణ సీడీవో ప్రతిభకు పట్టం కడుతుందన్నారు. అలాంటి ప్రతిభ చాటుకునేందుకు సీడీవో సంస్థ కృషి చేయాలని ఆయన ఉద్బోధించారు. లోపాలు సరిదిద్ది అదే ప్రతిష్టను ఇనుమడిరప చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదే సమయంలో సీడీవోలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఉగ్యోగాల భర్తీ చేపట్టడం సంస్థను బలోపేతం చేయడంలో భాగమే నన్నారు. ఐఐటిలు, ఎన్‌ఐటిల వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుండి నీటిపారుదల శాఖలో నియమితులైన ఇంజినీర్లకు సీడీవోలో పోస్టింగ్ ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడిరచారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్దిష్టమైన ఇంజినీరింగ్, సృజనాత్మక అవసరమని, అది అత్యుత్తమ శిక్షణ పొందిన నిపుణుల ద్వారానే సాధ్యపడుతుందన్నారు. పదవీ విరమణ పొందిన అనుభవం కలిగిన అనుభవజ్ఞులైన వారి సేవలు కుడా వినియోగించుకుని అద్భుతమైన ఫలితాలు రాబట్టాలన్నారు. అంతేగాక నీటిపారుదల శాఖ చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలక్ట్రో మెకానికల్ ఇంజినీరింగ్ ప్రాముఖ్యత మున్ముందు మరింత పెరగబోతుందన్నారు. అలాంటి సమయంలో లోతైన పరిజ్ఞానం కలిగి ఉన్న నిపుణులను నియమించడం ద్వారా సి.డి.ఓ తిరిగి పూర్వవైభవం చాటుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఐ. ఐ. టి హైదరాబాద్, జే. ఎన్.టి.యూ,టి.ఎస్ జెన్ కో వంటి సంస్థలకు చెందిన వారిని నియమించే ముందు టైంబౌండ్ పద్దతిలో డిజైన్ ల రూపకల్పన లో ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించడంతో పాటు సమయపాలనకు పెద్ద పీట వేయాలన్నారు. నెల్లికల్లు, డిరడి ఎత్తిపోతల పధకాలపై నల్లగొండ జిల్లాలో నెల్లికల్లు, డిరడి ఎత్తిపోతల పధకాల డిజైన్ లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆలస్యం అయే కొద్దీ రైతులకు నీరు అందించడంలో జరుగుతున్న జాప్యం దృష్టిలో పెట్టుకుని డిజైన్ లకు తక్షణం ఆమోదించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.





