కోమాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!

– కోడై కూస్తున్న అంతర్జాతీయ మీడియా

టెహ్రాన్, ఏప్రిల్ 7: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ చాలా రోజులుగా కోమాలో ఉన్నారన్న వార్త ఇప్ప్పుడు ప్రపంచమంతా దావానలంలా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారని కోడై కూస్తోంది. ఇరాన్ ప్రభుత్వ నిర్ణయాలలో మొజ్తాబా ప్రమేయం ఏవిÖ లేదని అంతర్జాతీయ విÖడియా అంటోంది. మొజ్తాబా ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నట్టు అమెరికా` ఇజ్రాయెల్ దేశాల నిఘా సంస్థలకు తెలుసని అంతర్జాతీయ విÖడియా పేర్కొంది. మొజ్తాబా తీవ్ర అనారోగ్యంతో ఉన్నందువల్ల నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారని తెలిపింది. అమెరికా`ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కుమారడు మొజ్తాబా ఖమేనీని తదుపరి సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. సుప్రీం లీడర్ అయిన తర్వాత కూడా మొజ్తాబా ఎక్కడా కనిపించలేదు. మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారని, ప్రాణాలు కూడా కోల్పోయి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో అన్నారు. ఖమేనీని చికిత్స నిమిత్తం రష్యాలోని మాస్కోకు తరలించారని కూడా వార్తలు వచ్చాయి. మొజ్తాబా ఖమేనీ ఇరాన్‌లోనే ఉన్నారని, బయటకు వెల్లడించలేని కారణాల వల్ల ఆయన బహిరంగంగా కనిపించడం లేదని రష్యా రాయబారి తెలిపారు. కాగా, మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై వచ్చిన ఈ వార్తలు ఇరాన్ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఇరాన్ ప్రభుత్వం లేదా అధికార వర్గాలు ఈ వార్తను అధికారికంగా ధ్రువీకరించలేదు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *