– డిమోనా అణు కేంద్రంపై దాడికి ఇరాన్ గురి
టెహ్రన్, మార్చి 6: ఇజ్రాయిల్ దాడులకు ప్రతిదాడులను ముమ్మరం చేసిన ఇరాన్ ఇజ్రాయెల్‌అణు రియాక్టర్‌పై గురిపెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్ తన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను డిమోనాకు రక్షణగా మోహరించింది. ప్రపంచంలోనే అత్యంత దుర్భేద్యమైన ప్రదేశంగా మార్చేసింది. ఇక్కడ యారో-2, 3, డేవిడ్ స్లింగ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇటీవల తన అత్యాధునిక ఐరన్ బీమ్‌ను కూడా ఇక్కడికే తరలించినట్లు కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు భూగర్భంలో కొన్ని అంతస్తుల కింద తన అణు కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ సురక్షితంగా ఉంచినట్లు తెలుస్తోంది. డిమోనాపై దాడికి ఇరాన్ అమ్ములపొదిలో డ్రోన్లు, క్షిపణులు వంటి చాలా రకాల ఆయుధాలు ఉన్నాయి. రియాక్టర్ నుంచి ఇరాన్ 1200-1500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతదూరం ప్రయాణించేందుకు టెహ్రాన్ అమ్ముల పొదిలో షహిన్ 136 డ్రోన్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఇది దాదాపు 50 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇక క్షిపణుల విషయానికి వస్తే సాహబ్-3, ఖైబర్‌షేకన్, ఎమాద్, ఖుర్రంషహర్, ఘద్ర, సెజ్జిల్, సుమర్ వంటి క్షిపణులున్నాయి. వీటి రేంజి 1300 కిలోటర్ల నుంచి 2500 కిలోటర్ల వరకు ఉంది. ఇవికాక ఫతా-2 హైపర్ సోనిక్ క్షిపణి కూడా ఉంది. ఇది ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలను కూడా తప్పించుకోగలదు. గతంలో సిరియాతో ఘర్షణ వేళ ఈ రియాక్టర్ సపంలో కొన్ని క్షిపణులు పడ్డాయి. ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత పొరుగు దేశాలు వరుసగా దానితో యుద్దాలకు దిగాయి. అమెరికా సాయంతో.. వాటిని ఓడించినా ఎప్పటికైనా తన ఉనికికి ముప్పు తప్పదని గ్రహించింది. దీంతో నాటి ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ తమ దేశాన్ని అణుశక్తిగా మార్చాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రాన్స్ సాయంతో అణు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు నెగెవ్ ఎడారిలో ’డిమోనా’ అనే ప్రదేశంలో ఓ భారీ రియాక్టర్‌ను ఇజ్రాయెల్ నిర్మించింది. ఐరోపా దేశాల టెక్నాలజీ, బ్లూప్రింట్స్, నిపుణుల సాయంతో దీనిని రూపొందించారు. ఇందులోని భూగర్భ బంకర్లలో అణుబాంబులకు వాడే ప్లుటోనియం ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ విషయం అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. అలా ఇజ్రాయెల్ అణ్వాయుధం తయారీలో డిమోనా రియాక్టర్ కీలక పాత్ర పోషించింది. ఈ రియాక్టర్‌కు ఉత్తరం వైపు 85 కిలోటర్ల దూరంలో జెరూసలెం నగరం ఉంది. ఇక 75 కిలోటర్ల దూరంలో ఈజిప్ట్ సరిహద్దులు.. 25 కిలోమీటర్ల దూరంలో జోర్డాన్ ఉన్నాయి. ఒకవేళ దాడి జరిగితే ఇక్కడి నుంచి లీకయ్యే రేడియేషన్ ప్రభావం ఈ దేశాలకు కూడా పాకే ప్రమాదం ఉంది.
యుద్ధం నుంచి వెనక్కి తగ్గేదే లేదు: అమెరికా రక్షణ మంత్రి హెగ్సెథ్ 
వాషింగ్టన్ : ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నుంచి వెనక్కి తగ్గేదే లేదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెథ్ స్పష్టం చేశారు. అమెరికా సైనిక శక్తిని ఇరాన్ తక్కువ అంచనా వేస్తోందన్నారు. ఈ యుద్ధంలో అమెరికా నిలబడలేదని ఇరాన్ అనుకుంటోందని, తాము అసలు పోరాటాన్ని ఇప్పుడే మొదలుపెట్టామని పేర్కొన్నారు. ఇక గల్ఫ్ ప్రాంత సముద్ర జలాల్లో అమెరికా నౌకాదళాలు వెనక్కి జరుగుతున్నాయనే ప్రచారాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఖండించింది. యావత్ ఇరాన్ నేవీని సముద్రంలో ముంచేసే వరకు తమ మిషన్ ఆగదని తేల్చిచెప్పింది. గత 72 గంటల్లో ఇరాన్‌లోని దాదాపు 200 లక్ష్యాలపై అమెరికా బాంబర్ ఫోర్స్ వైమానిక దాడులు చేసిందని సెంట్‌కామ్ వెల్లడించింది. బి-2 స్పిరిట్ బాంబర్ విమానాల నుంచి కేవలం ఒక గంట వ్యవధిలోనే 2వేల పౌండ్ల బరువున్న డజన్ల కొద్దీ పెనెట్రేటర్ బాంబులను బాలిస్టిక్ మిస్సైల్ లాంచ్ ప్యాడ్లపై వేశామని పేర్కొంది. అమెరికా సంకల్పం ఎంత బలమైందో ఇరాన్ అర్థం చేసుకోలేకపోతోందని మంత్రిహెగ్సెథ్ అన్నారు. ఇరాన్‌పై తమ సైనిక చర్యను బలంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లో విలేకరుల సమావేశం వేదికగా పీట్ హెగ్సెథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాను ఇరాన్ నేతలు, ఐఆర్‌జీసీ తక్కువ అంచనా వేస్తున్నాయని, తమ సంకల్పానికి కట్టుబడి ఉంటామని, ఇరాన్‌పై పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. పూర్తి శక్తితో అమెరికా ఇప్పుడే దాడులను మొదలుపెట్టిందన్నారు. ఒకవేళ అవసరమైతే దీర్ఘకాలంపాటు ఈ యుద్దాన్ని చేసేందుకూ సన్నద్ధమై ఉందన్నారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో అరబ్ దేశాల నుంచి అమెరికాకు శరణార్ధులు క్యూ కట్టే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే అరబ్ శరణార్ధులకు అమెరికాలో ఆశ్రయాన్ని కల్పించే ఎలాంటి ప్రణాళికలూ ప్రస్తుతానికి తమకు లేవని అమెరికా రక్షణ మంత్రి తేల్చి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





