ఇరాన్‌ ‌ప్రతీకార దాడులు ముమ్మరం

– సౌదీలో అతిపెద్ద చమురుశుద్ది కేంద్రంపై దాడి

టెహ్రాన్‌,‌ మార్చి2: అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ ‌చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇప్పటికే అనేక భవనాలు, కీలక స్థావరాలు నేలమట్టం అయ్యాయి. అయితే తాజాగా సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్‌కో రిఫైనరీపై ఇరాన్‌ ‌డ్రోన్‌ ‌దాడి చేసినట్లు తెలుస్తోంది. రాస్‌ ‌తనురాలోని ఈ రిఫైనరీపై షాహెద్‌-136 ‌డ్రోన్‌తో దాడి  చేసినట్లు అంతర్జాతీయ డియా కథనాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్‌ ‌డియాలో వైరల్‌ అవుతోన్నాయి. ఈ దాడి ప్రభావం చమురు ధరలపై ఉంటుందని మార్కెట్‌ ‌నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ డియా కథనం ప్రకారం.. సోమవారం ఇరాన్‌ అరామ్‌ ‌కో రిఫైననరీపై దాడి చేసింది. ఈ దాడి కారణంగా చమురుశుద్ధి కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన నేపథ్యంలో రిఫైనని తాత్కాలికంగా మూసివేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని సమాచారం. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అమెరికా, ఇజ్రాయెల్‌ ‌సంయుక్త దాడులకు ఇరాన్‌ ‌ప్రతీకార దాడులకు దిగిన తరువాత చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ యుద్ధం కారణంగా వివిధ దేశాలకు ఇంధన కొరత ఏర్పడనుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా చమురు ధరలు మండుతున్నాయి. చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్‌ ‌జలసంధిలో నౌకల రవాణాను ఇరాన్‌ అడ్డుకోవడంతో ధరలు 10 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ‌ముడి చమురు ధర 80 డాలర్లు దాటింది. ఇప్పుడు తాజా దాడులతో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ ‌నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంధన ధరలు పెరుగుదల అనేది సామాన్యులు వినియోగించే కిరాణా సామాగ్రి, ఇతర వస్తువుల ధరలపై ప్రభావం చూపనుంది. చాలా మంది వినియోగదారులు ఇప్పటికే పెరిగిన ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నారు. మరోవైపు, పశ్చిమాసియా దేశాలపై ఇరాన్‌ ‌ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. కువైట్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్‌ ‌దాడి జరగ్గా.. దుబాయ్‌, ‌దోహా, అబుదాబి, జెరూసలెంలోనూ సోమవారం పేలుడు శబ్దాలు వినిపించాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *