– ఇజ్రాయిల్ రక్షణ దళం ప్రకటన
టెహ్రాన్, మార్చి 4: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ రహస్య భూగర్భ అణుప్రాజెక్టును తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. టెహ్రాన్ సరిహద్దుల్లోని మింజాదెహైలో రహస్యంగా ఏర్పాటుచేసిన న్యూక్లియర్ కేంద్రం కాంపౌండ్‌పై దాడి చేసినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డెఫ్రిన్ తెలిపారు. ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు రహస్యంగా పనిచేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. 2025లో అమెరికా దాడుల తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఇక్కడికి మళ్లించినట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్‌లో తాము ఇరాన్‌పై ’ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో 12 రోజుల పాటు దాడులు చేసిన విషయాన్ని డెఫ్రిన్ ప్రస్తావించారు. ఆ సమయంలో వాడిన మందుగుండు సామగ్రి కంటే ఎక్కువ పేలుడు పదార్థాలను ఈ నాలుగు రోజుల్లో ఇరాన్‌పై ప్రయోగించినట్లు తెలిపారు. గతంలో తాము ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ ఆ దేశం అణు కార్యకలాపాలను ఆపకుండా.. అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాటిని టెహ్రాన్ శివార్లలోని రహస్య భూగర్భ స్థావరంలో భద్రపరిచిందని తమకు కచ్చితమైన సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన 300 క్షిపణి లాంచర్‌లను తాకాయని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆ దేశంలోని బాలిస్టిక్ క్షిపణి శ్రేణులు, వైమానిక రక్షణ వ్యవస్థలపై తమ వైమానిక దళాలు దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన తాజా దాడులకు సంబంధించిన దృశ్యాలను ఐడీఎఫ్ సోషల్ డియాలో షేర్ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





