శ్రీ‌లంక తీరంలో ఇరాన్‌ ‌నౌకపై దాడి

– 101 మంది గల్లంతైనట్లు సమాచారం

కొలంబో, మార్చి 4: ఇజ్రాయెల్‌-అమెరికా కూటమి, ఇరాన్‌ ‌మధ్య యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్‌కు చెందిన నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది గల్లంతయ్యారు. మరో 78 మంది గాయపడినట్టు శ్రీలంక నేవీ, రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు బుధవారం తెలిపాయి. వీరిలో 32 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నాయి. కాగా, 180 మందితో ఉన్న ఐఆర్‌ఐఎస్‌ ‌దేనా నౌక మునిగిపోతున్నట్టు తమకు సమాచారం రావడంతో వెంటనే సహాయక సిబ్బందిని రంగంలోకి దించినట్టు విదేశాంగ మంత్రి విజిత హెరాథ్‌ ‌తెలిపారు. నౌక వేగంగా మునిగిపోతున్న సమయంలో 32 మందిని సిబ్బంది రక్షించారు. గాలె నగర సపంలో దక్షిణ తీరానికి కొద్ది దూరంలో ఈ దాడి జరిగింది. క్షతగాత్రులను గాలేలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సబ్‌మెరైన్‌తో దాడి జరిపిందెవరనేది వెంటనే వెల్లడి కాలేదు. ఐఆర్‌ఐఎస్‌ ‌దేనా నౌక విశాఖపట్నంలో జరిగిన నావికా విన్యాసాల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *