హర్మూజ్‌పై ఇరాన్ పట్టు బిగింపు

– ఇటు వెళ్లే నౌకలకు గరిష్ఠంగా రూ.18.90 కోట్ల టోల్

టెహ్రాన్, 31: చమురు రవాణాలో ప్రపంచానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయడానికి ఆ దేశ పార్లమెంట్ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. హర్మూజ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై ఈ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్ల నుంచి భారీ మొత్తంలో రుసుము వసూలు చేయనున్నారు. ఒక్కో ట్యాంకర్‌పై గరిష్ఠంగా సుమారు రూ.18.90 కోట్ల వరకు టోల్ విధించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం వెనుక హర్మూజ్‌పై తమ సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యం ఉందని ఇరాన్ అధికారిక  మీడియా పేర్కొంది. కొత్త విధానంలో భాగంగా సముద్ర భద్రతను పెంచడం, నౌకాయాన నియంత్రణను కట్టుదిట్టం చేయడం, ఆర్థిక నియమావళిని అమలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. అ టోల్ వ్యవస్థను అనుసరించి ఇప్పటికే 26 నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించినట్లు తెలిపింది. ఆయా నౌకలు అవసరమైన పత్రాలు సమర్పించి అనుమతి కోడ్‌లు పొందినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయంపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ఈ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలని పేర్కొన్నారు. ఇదే సమయంలో జీ7 దేశాలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణా కొనసాగేందుకు తక్షణ చర్యలు అవసరమని సూచించాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *