– ఇజ్రాయిల్ దాడిలో నేవీ చీఫ్ అలీరెజా దుర్మరణం
టెహ్రాన్, మార్చి 26 :ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ చీఫ్ అలీరెజా తంగ్సిరిని ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ తీర ప్రాంత నగరమైన బందర్ అబ్బాస్‌పై జరిపిన దాడుల్లో అలీరెజాతో పాటు మరికొందరు సీనియర్ నౌకాదళ కమాండర్లు మతి చెందినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ విషయంపై ఇరాన్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. 2018 నుంచి అలీరెజా ఐఆర్‌జీసీ నేవీ చీఫ్ పదవిలో కొనసాగుతున్నారు. హోర్ముజ్ జలసంధి మూసివేతను ఆయనే పర్యవేక్షిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్`అమెరికా మధ్య ఒకవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు దాడులు కూడా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్‌లోని కెఫర్ ఖాసీం ప్రాంతంలో ఐదుగురు, టెల్ అవీవ్‌లో ఇద్దరు గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైనిక నియంత్రణ కేంద్రం, అణు మౌలిక సదుపాయలకు సంబంధించిన పరిశ్రమలపై దాడులు చేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటన చేసింది.
అబుదాబిపై మిస్సైల్ దాడి : ఇద్దరి మృతి వారిలో ఒకరు భారతీయుడు
:ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం 27వ రోజుకు చేరుకుంది. ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా వెనకడుగు వేసినా.. ఇజ్రాయెల్ మాత్రం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌తో పాటు అరబ్ దేశాలపై కూడా ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్ల దాడులు చేస్తోంది. గురువారం అబుదాబిపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది. అబుదాబి ఆ మిస్సైల్‌ను గాల్లోనే పేల్చేసింది. అయితే, మిస్సైల్ తాలూకా శకలాలు విÖద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఒకరు భారతీయుడు కాగా.. మరొకరిని పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ది అబుదాబి విÖడియా ఆఫీస్ ఈ సంఘటపై స్పందించింది. ఈ మేరకు గురువారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ’ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా బాలిస్టిక్ మిస్సైల్‌ను అడ్డుకుంది. ఈ నేపథ్యంలోనే శకలాలు విÖద పడి ఇండియా, పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు’అని పేర్కొంది. కాగా, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల కారణంగా మతి చెందిన భారతీయుల సంఖ్య ఏడుకు చేరింది. ఇరాన్ ప్రయోగిస్తున్న మిస్సైల్స్, డ్రోన్లను యూఏఈ ఏయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. ఇప్పటి వరకు 372 బాలిస్టిక్ మిస్సైల్స్, 15 క్రూయిస్ మిస్సైల్స్, 1,826 యూఈవీలను యూఏఈ ఏయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసింది.యుద్ధం విషయంలో వెనక్కు తగ్గిన ట్రంప్ ఇరాన్‌కు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాతో ఒప్పందం విషయంలో మరీ ఆలస్యం చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఓ వైపు ఒప్పందం కోసం ప్రయత్నిస్తూనే బయటకు మరోలా మాట్లాడుతోందని ఇరాన్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యం కాకముందే సీరియస్‌గా వ్యవహరించడం మంచిదని హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




