కువైట్ చమురు శుద్ధి కర్మాగారంపై దాడి

– డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్
– పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు కువైట్ ప్రకటన

కువైట్ సిటీ, ఏప్రిల్ 3: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. శుక్రవారం కువైట్‌లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం మీనా అల్‌ అహ్మదిపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీఎత్తున మంటలు చెలరేగినట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది కషి చేస్తున్నారని పేర్కొంది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో విÖనా అల్`అహ్మది ఒకటి. కువైట్ చమురు ఉత్పత్తికి ఇది చాలా కీలకం. విÖనా అల్`అహ్మది కర్మాగారం నుంచి రోజుకు 3,46,000 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తారు. లక్షల బ్యారెళ్ల మేర డీజిల్, ఇతర శుద్ధి చేసిన ఇంధనాలను ఆసియా, యూరప్‌లోని మార్కెట్లకు ఎగుమతి చేస్తూ ప్రభుత్వానికి కీలకమైన ఆదాయ వనరుగా నిలుస్తోంది. ఈ కర్మాగారం లేకపోతే అక్కడ ఉత్పత్తి అయ్యే చమురును శుద్ధి చేయలేక బావులను మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇక్కడినుంచి భారత్ సహా ఇతర దేశాలు చమురును దిగుమతి చేసుకుంటాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం భారత్ కువైట్ నుంచి చమురు దిగుమతులు నిలిపివేసింది. జాతీయ ఆయిల్ కంపెనీపై డ్రోన్ దాడి జరిగినట్లు, దీంతో పలు యూనిట్లలో మంటలు చెలరేగాయని కువైట్ న్యూస్ ఏజెన్సీ శుక్రవా రం పేర్కొంది. ఉదయం మినా అల్`అహ్మదీ రిఫైనైరీ లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగిందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (కెపిసి) విÖడియాకు తెలిపింది. గల్ఫ్ భూభాగంపైకి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్‌లను వైమానిక రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంటుందని కువైట్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా సైరన్‌లు మోగుతున్నాయని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *