– నగర పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్
- హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా సివి ఆనంద్
– ఆర్టీసీ ఎండిగా నాగిరెడ్డి నియామకం
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: తెలంగాణలో భారీగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్‌ను, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను నియమించింది. ఆర్టీసీ ఎండిగా ఉన్న సజ్జన్నార్ తిరిగి నగర కమిషనర్‌గా నియమితులయ్యారు.విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్, ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్, ఫౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్ర, గ్రేహౌండ్స్ ఆక్టోపస్ అదనపు డిజీగా అనిల్ కుమార్, మల్టీజోన్ 2 ఐజీగా డీఎస్ చౌహన్, విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్ హైదరాబాద్ నేర విభాగ అదనపు సీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా తఫ్సీర్ ఇక్బాల్, సిద్దిపేట కమిషనర్‌గా ఎస్.ఎమ్ విజయ్ కుమార్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ, నారాయణపేట ఎస్పీగా జి. వినీత్, ఎల్బీనగర్ డీసీపీగా బి. అనురాధ, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సీహెచ్ ప్రవీణ్ కుమార్, రాజేంద్రనగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్, వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, మాదాపూర్ డీసీపీగా రితు రాజ్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్‌గా రవి గుప్తా నియమితులయ్యారు. తెలంగాణ డీజీపీగా ఇప్పటికే బత్తుల శివధర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇదిలా వుండగా, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరు ఇటీవల వివాదాస్పదంగా మారింది. దీంతో అతడిపై తాజాగా బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో హరితను నియమించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





