‘స్థానిక’ ఎన్నికల కసరత్తు వేళ భారీగా ఐపీఎఎస్‌ల బదిలీ

– పలు జల్లాలకు కొత్త ఎస్పీల నియామకం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌21: ‌తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దంచేస్తున్న వేళ ప్రభుత్వం భారీ ఎత్తున పోలీస్‌ అధికారులను బదిలీ చేసింది. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్‌ ‌వొస్తే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వొస్తుంది. దీంతో ముందుగానే ప్రభుత్వం ఐపిఎస్‌లను బదిలీ చేసినట్లు అర్థం అవుతోంది.  ప్రస్తుతం ఉన్న వారిలో చాలామందిని బదిలీ చేసింది. ఈ క్రమంలో మొత్తం 32 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్‌ ‌డీజీగా జయేంద్రసింగ్‌ ‌చౌహాన్‌, ‌సీఐడీ డీజీగా పరిమళ హన నూతన్‌ ‌జాకబ్‌, ‌పోలీసు అకాడ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతన్‌ ‌మైలబత్తుల, మహేశ్వరం జోన్‌ ‌డీసీపీగా కే నారాయణ రెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ ‌బ్యూరో ఎస్పీగా పీవీ పద్మజలు నియమితులయ్యారు. ఇక నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా సంగ్రామ్‌ ‌సింగ్‌, ‌హైదరాబాద్‌ ‌సౌత్‌ ‌జోన్‌ ‌డీసీపీగా కిరణ్‌ ‌ప్రభాకర్‌, ‌మహబూబాబాద్‌ ఎస్పీగా శబరీష్‌, ‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌ ఎస్పీగా నిఖిత, టీజీ యాంటీ నార్కోటిక్స్ ‌బ్యూరో ఎస్పీగా గిరిధర్‌, ‌వికారాబాద్‌ ఎస్పీగా స్నేహా మిశ్రా బదిలి అయ్యారు. హైదరాబాద్‌ ‌టాస్క్‌ఫోర్స్ ‌డీసీపీగా గైక్వాడ్‌ ‌వైభవ్‌, ‌ములుగు ఎస్పీగా కేకన్‌ ‌సుధీర్‌ ‌రామ్‌నాథ్‌, ‌జయశంకర్‌ ‌భూపాలపల్లి ఎస్పీగా సంకీర్త్, ‌గవర్నర్‌ ఏడీసీగా పాటిల్‌ ‌కాంతిలాల్‌ ‌సుభాష్‌, ‌పెద్దపల్లి డీసీపీగా రామ్‌ ‌రెడ్డి, మల్కాజ్‌గిరి డీసీపీగా సీహెచ్‌ శ్రీ‌ధర్‌, ‌భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్‌ ఎస్పీగా అవినాష్‌ ‌కుమార్‌, ‌భువనగిరి అడిషనల్‌ ఎస్పీగా కంకణాల రాహుల్‌ ‌రెడ్డి, జగిత్యాల అడిషన్‌ ఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ములుగు అడిషనల్‌ ఎస్పీగా శివం ఉపాధ్యాయ, ఆదిలాబాద్‌ అదనపు ఎస్పీగా మౌనిక, ఏటూరు నాగారం ఏఎస్పీగా మనన్‌ ‌భట్‌, ‌నిర్మల్‌ ఏఎస్పీగా సాయికిరణ్‌, ‌వేములవాడు ఏఎస్పీగా రుత్విక్‌ ‌సాయి, సత్తుపల్లి ఏసీపీగా యాదవ్‌ ‌వసుంధర, టీజీ ట్రాన్స్‌కో ఎస్పీగా శ్రీనివాస్‌, ‌వనపర్తి ఎస్పీగా సునీత నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *