– దీనిపై మాట్లాడితే దుష్ప్రచారమా?
– మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: తను ఇప్పపూవు సారా గురించి చెబితే తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. కల్తీసారా తాగకండి అంటే తనను బద్నాం చేస్తారా అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు ప్రైవసీ అనేది లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఆదివాసీలు లిక్కర్ తయారుచేస్తే తప్పా? కార్పొరేట్ కంపెనీలు చేస్తే కరెక్టా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పసారాకు 3 వేల ఏళ్ల చరిత్ర ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇప్పసారా ఇండియన్ లిక్కర్ అని ఆయన అభివర్ణించారు.ఇప్పసారాకు శతాబ్దాల చరిత్ర ఉందని అనిరుధ్‌రెడ్డి ఇటీవల వెల్లడించారు. ఈ రకమైన సారా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. గతంలో దీన్ని తాగి 110 ఏళ్లు బతికారని ఆయన వివరించారు. అనిరుధ్ వ్యాఖ్యలపై ప్రజలు తమదైన శైలిలో సోషల్ డియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా సినీతారలపై అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని.. అలాగే సినీతారలు కూడా టెస్ట్ చేయించు కోవాలని ఆయన సూచించారు. వారిపైనే అధికంగా డ్రగ్స్ ర్యూమర్స్ ఉన్నాయని గుర్తుచేశారు. కానీ రాజకీయ నాయకులపై ఈ పుకార్లు తక్కువేనన్నారు. ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయించు కోవాలంటూ సినీనటులకు సూచించారు. డ్రగ్ టెస్ట్‌లో నెగెటివ్ వస్తేనే షూటింగ్స్‌లో పాల్గొనేందుకు అనుమతించాలని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ బారినపడిన వారు చిత్ర పరిశ్రమలలోనే అధికంగా ఉన్నారని ప్రజలు భావిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం రేవంత్ మద్యం, ధూమం వంటివాటికి దూరంగా ఉంటారన్నారు. తాము కూడా డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నామని అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు.
——————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.