అంతర్జాతీయ సదస్సుకు వెంకట్ రెడ్డికి ఆహ్వానం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 6:  మొరాకో దేశంలోని మరాకెష్ నగరంలో ఫిబ్రవరి 11 నుండి 13, 2026 వరకు నిర్వహించనున్న ఆరవ అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సదస్సులో పాల్గొనాలని ఎంవీ ఫౌండేషన్‌కు జాతీయ కన్వీనర్ ఆర్.వెంకట్ రెడ్డి కిఆహ్వానం అందింది. ఈ సదస్సును మొరాకో ప్రభుత్వం మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ  సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, కార్మిక మరియు యజమాని సంస్థలు, పౌర సమాజ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, అకాడమిక్ రంగ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అవసరమైన చర్యలపై చర్చించనున్నారు. ఎం.వి.ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ శ్రీ ఆర్.వెంకట్ రెడ్డి ఈ సదస్సులో పాల్గొని, సమాజ భాగస్వామ్యంతో బాల కార్మికులను పనిలో నుంచి బయటకు తీసుకువచ్చి పాఠశాలల్లో చేర్పించి బాల కార్మిక రహిత ప్రాంతాల ఏర్పాటు గురించి ఎంవీ ఫౌండేషన్ అనుభవాలను పంచుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా లక్షలాది పిల్లలు బాల కార్మిక వ్యవస్థలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సదస్సు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. బాలలందరికీ విద్య హక్కు కల్పించడమే బాల కార్మిక నిర్మూలనకు శాశ్వత పరిష్కారమని ఎం.వి.ఫౌండేషన్ పేర్కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *