– మంత్రి తుమ్మలకు ఆహ్వాన పత్రిక అందజేసిన సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో గురువారం కలిసి ములుగు జిల్లా మేడారంలో జరుగు సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఆహ్వాన పత్రికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అందజేశారు. ఈనెల 28నుంచి 31వ తేదీ వరకు జరుగు జాతరకు రావాల్సిందిగా ఆహ్వానించిన ఆహ్వానించారు. మంత్రి సీతక్క వెంట ములుగు డీసీసీి అధ్యక్షుడు పైడాకుల అశోక కూడా ఉన్నారు. కాగా, జాతరకు ఆహ్వానం పలికినందుకు మంత్రి సీతక్కను తుమ్మల నాగేశ్వరరావు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





