తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రండి

– జమ్మూకశ్మీర్‌ సీఎం అబ్దుల్లాను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్‌ 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ఈనెల 8,9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న.. తెలంగాణ రైజింగ్‌-2047 గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరవ్వాలని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆహ్వానించారు. న్యూదిల్లీలోని జమ్ముకశ్మీర్‌ హౌస్‌లో సీఎం ఒమర్‌ అబ్దుల్లాను మంత్రి కలిశారు. గ్లోబల్‌ సమ్మిట్‌ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. అన్ని రంగాల నిపుణుల మేధో మథనంతో తయారు చేసిన ఈ విజన్‌ డాక్యుమెంట్‌ను గ్లోబల్‌ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వివరించారు. గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానించినందుకు ముఖ్యమంత్రి, స్వయంగా ఆహ్వానపత్రాన్ని అందచేసిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సమ్మిట్‌కు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తు హైదరాబాద్‌ ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నానని ఒమర్‌ అబ్దుల్లా అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *