సమ్మిట్‌కు రావాల్సిందిగా గవర్నర్‌కు ఆహ్వానం

– ఆహ్వాన పతిక్ర అందజేసిన మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్‌ ప్యూచర్‌ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆహ్వానించింది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆయన వెంట ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *