హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10ః మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి జాతర మహోత్సవానికి రావలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కలిసి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం పలి కారు. ఆమెతోపాటు దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. అలాగే కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు-2026కు కూడా మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఈవో సుధాకర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


