శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు రండి

– మంత్రి వాకిటికి భ‌ద్రాద్రి ఆల‌యం త‌ర‌పున‌ ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: భద్రాచలంలో ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని భద్రాచలం దేవస్థానం ఈవో దమోదర్, అర్చకుల బృందం ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణలతో మంత్రి శ్రీహరి దంపతులను ఆశీర్వదించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి వాకిటి భద్రాచలం శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. మంత్రిని ఆహ్వానించిన వారిలో భద్రాచలం ఆలయ ఉప ప్రధానార్చకులు శ్రీనివాస రామానుజం, రామాయణం పారాయణుడు అంతర్వేది కృష్ణమాచార్య, ఏఈవో భవానీ రామకృష్ణలు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *