– పేరెన్నికగన్న కంపెనీలతో పలు ఒప్పందాలు
– ముందస్తు కార్యక్రమాలతోనే రాహుల్, ఖర్గేలు రాలేదు
– త్వరలోనే పార్టీ పదవుల భర్తీ
– మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: గ్లోబల్ సమ్మిట్‌తో ఊహించని స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు వొచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. పేరుగాంచిన కంపెనీలతోనే తమ ప్రభుత్వానికి ఒప్పందాలు జరిగాయని వివరించారు. ముందు కొన్ని కార్యక్రమాలు ఫిక్స్ కావడంతో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే ,రాహుల్ గాంధీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రాలేకపోయారని తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో డియాతో మహేశ్ కుమార్ గౌడ్ చిట్‌చాట్ చేశారు.తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము తమకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. శ్వేతపత్రం అంటే బీఆర్‌ఎస్‌కు భయమని ఎద్దేవా చేశారు మహేశ్ కుమార్ గౌడ్. ఫ్యూచర్ సిటీ భవిష్యత్‌లో గొప్పగా ఉంటుందని తెలిపారు. త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‌లు భర్తీ చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. టీపీసీసీ నియామకం జరిగిన రోజే డీసీసీలతో మినహా అన్ని పోస్టులు రద్దు అవుతాయని తెలిపారు. ఈనెల చివరి నాటికి కార్పొరేషన్ చైర్మన్‌లు, డైరెక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. లంబాడాలకు నాలుగు జిల్లాలకు అధ్యక్షులను నియమించామని తెలిపారు. ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చూడలేక మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. లావాదేవీలలో భాగంగానే కవిత – బీఆర్‌ఎస్ నేతల మధ్య విమర్శలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కవిత కారణంగా బీఆర్‌ఎస్ కబ్జాలు అన్ని బయటకు వస్తున్నాయని విమర్శించారు. కవిత ఆరోపణలపై విచారణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తాను టీపీసీసీగా చాలా సంతృప్తిగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆర్గనైజేషన్ అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. డియాలోనే తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారని చెబుతున్నారని.. అప్పుడే మంత్రి పదవి ఇస్తున్నారంటూ కూడా ఊహాగానాలు వస్తున్నాయని తెలిపారు. లోక్‌సభలో ప్రియాంక గాంధీ చాలా బాగా మాట్లాడారని ప్రశంసించారు మహేశ్ కుమార్ గౌడ్. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ కోసం వందేమాతరాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాహర్ లాల్ నెహ్రూను విమర్శిస్తూ జీవితంలో అతిపెద్ద పొరపాటు చేశారని మండిపడ్డారు. నెహ్రూ వల్లే దేశం వెనకబడిందని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లాలంటే బయపడ్డారని ఎద్దేవా చేశారు. 1965లో ఇందిరాగాంధీ ఆర్టస్ కాలేజీకి వొచ్చారని, 60 సంవత్సరాల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టస్ కాలేజీకి వెళ్లడం చరిత్రగా నిలిచిందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.