– కడియం విచారణ పూర్తి
– దానం విచారణ 7కు వాయిదా
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. గురువారం కడియం శ్రీహరిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు. కొన్ని గంటలపాటు సాగిన ఈ విచారణ ముగిసింది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ పూర్తి కాలేదు. ఆయన విచారణను శనివారానికి అంటే 7వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసులో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఇరువర్గాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. దీంతో ఈ పిటిషన్లను స్పీకర్ శనివారం విచారించనున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న పలువురి ఎమ్మెల్యేల విచారణ ఇప్పటికే పూర్తయింది. వారందరికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం విదితమే. ఈ కేసులో ఎమ్మెల్యే దానం విచారణ కూడా పూర్తయితే ఈ ఫిరాయింపుల వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.