పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి

– కెనడా హైకమిషనర్‌ బృందంతో సీఎం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: రాష్ట్రంలో స్టార్టప్స్‌, ఎడ్యుకేషన్‌, అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హైకమిషనర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. హైకమిషనర్‌ ఆఫ్‌ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్‌ కూటర్‌ బృందం ముఖ్యమంత్రితో శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, అర్బన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో కెనడాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఇరువ‌ర్గాల మ‌ధ్య‌ చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కెనడా హైకమిషనర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో కారెన్‌, కెనడా మినిస్టర్‌ ఎడ్‌ జాగర్‌, ట్రేడ్‌ కమిషనర్‌ విక్రమ్‌ జైన్‌, స్పెషల్‌ సీఎస్‌ జయేష్‌ రంజన్‌, విష్ణువర్ధన్‌ రెడ్డి, అజిత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *