అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

– మార్చి 6న వేడుకలకు మంత్రి సీతక్కకు ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2026 కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన పోస్టర్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, మార్చి 6న జరగనున్న మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని టీజీవో మహిళా విభాగం మంత్రిని ఆహ్వానించింది. అనంతరం టీజీవో ప్రతినిధులు ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వాటి పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టీజీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్, మహిళా విభాగం చైర్‌పర్సన్ డాక్టర్ దీపారెడ్డి. కోశాధికారి జి. శాంతిశ్రీ, శిరీష, సంతోష్, జయశ్రీ, రేవతి, డాక్టర్. చైతన్య, డాక్టర్ రమాదేవి, డాక్టర్ శైలజ, డాక్టర్ అనితారెడ్డి, రోజా, జ్యోతి, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *