డిసెంబర్‌లో ఇంటర్నేషనల్‌ షార్టు ఫిలిం ఫెస్టివల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. డిసెంబర్‌ 19 నుండి 21వ తేదీ వరకు దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిలిం స్టడీ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. ఈ ఫెస్టివల్‌ నిర్వహణ కోసం ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.30లక్షల బడ్జెట్‌ విడుదలకు మంత్రి అనుమతి ఇచ్చారు. ఈమేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *