వెబ్సైట్ లో కాళేశ్వరం పై కమిషన్ సంక్షిప్త నివేదిక అప్లోడ్ చేసి ఉంటే అది తప్పు.. వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలు అవసరం లేదు అని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వానికి, కమిషన్ కు మూడు వారాల్లో గా కౌంటర్ దాఖలు చేయాలనీ నోటీసులు ఇస్తూ ఆ తర్వాత వారంలో రిప్లై కౌంటర్ వెయ్యాలని పిటీషనర్ల కు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాకే తగిన నిర్ణయం ఉంటుందని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేసారు.
కాళేశ్వరం నివేదిక పై మధ్యంతర స్టే ఆదేశాలు అవసరం లేదు : హైకోర్టు





