– అధికారికంగా ప్రకటించిన బోర్డు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగగా దాదాపు తొమ్మిదిన్నర లక్షల మందికి విద్యార్థులు హాజరయ్యారు. వెబ్‌సైట్‌లలో విద్యార్థులు తమ రోల్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఒక్క క్లిక్‌తోనే రిజల్ట్‌ను పొందవచ్చు. మరోవైపు, ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా తమ వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొనే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ ఫలితాల కోసం సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సప్‌లోనే పొందేలా ఏర్పాటు చేసింది. స్మార్ట్ ఫోన్‌లలో 80969 58096 నంబర్‌ను సేవ్ చేసుకొని హాయ్ అని టైప్ చేయడం ద్వారా ఫలితాలు పరిశీలించుకోవచ్చు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





