ఇంటర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ ‌విడుదల

-ఫిబ్రవరి 2నుంచి ప్రాక్టికల్స్
‌- 25 నుంచి మార్చి 18 వరకు  పరీక్షలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌31: ‌తెలంగాణలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్‌ ‌పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్‌ ‌బోర్డు విడుదల చేసింది. వొచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్‌ ‌ప్రాక్టికల్‌ ‌పరీక్షలు ప్రారంభమై ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయని పేర్కొంది. ఇంటర్‌ ‌ఫస్ట్ ఇయర్‌, ‌సెకండ్‌ ఇయర్‌ ‌విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కేవలం సెకండ్‌ ఇయర్‌ ‌విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్‌ ‌పరీక్షలు జరిగేవి. ఈసారి వీరితో పాటు ఫస్ట్ ఇయర్‌ ‌విద్యార్థులకూ ల్యాబ్‌ ‌ప్రాక్టికల్స్ ‌నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్‌ ‌విద్యార్థులకు ఇంగ్లీష్‌ ‌ప్రాక్టికల్‌ ‌పరీక్ష, జనవరి 23వ తేదీన ఎథిక్స్ అం‌డ్‌ ‌హ్యుమన్‌ ‌వాల్యూస్‌, ‌జనవరి 24వ తేదీన ఎన్విరాన్‌ ‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ ‌పరీక్ష నిర్వహించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *