హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి అండగా నిలుస్తూ పోలీస్ శాఖ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా బీమా పరిహారాన్ని అందజేశాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా (నెం. 1522) విధులు నిర్వహించిన ఎం. వెంకటేశ్ గతేడాది ఏప్రిల్ 27న జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హోంగార్డు విభాగంతో యాక్సిస్ బ్యాంక్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, వేతనం అకౌంట్ కలిగిన సిబ్బందికి వర్తించే ప్రమాద బీమా సౌకర్యం కింద రూ. 34 లక్షల పరిహారం మంజూరైంది. డిజిపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ డిజిపి (హోంగార్డ్స్) స్వాతి లక్రా చేతుల మీదుగా ఈ చెక్కును మృతుడి భార్య కొడిగంటి స్వాతికి అందజేశారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ హోంగార్డు కుటుంబానికి పోలీసు శాఖ తరపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో బాధిత కుటుంబానికి సకాలంలో ఆర్థిక సాయం అందించిన యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, బ్యాంక్ ప్రతినిధులు, హోంగార్డ్ రీజియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు, ఏవో సాయి కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




