– రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం
– రూ.1.31కోట్ల చెక్కు అందజేసిన డీజీపీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8 : రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా అందాల్సిన బీమా మొత్తాన్ని డీజీపీ బి శివధర్ రెడ్డి చేతుల మీదుగా ఆయన కార్యాలయంలో గురువారం నాడు అందజేశారు. అంబర్‌పేట సిపిఎల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన బోయ పాండు, ఆయన భార్య గత ఏడాది మార్చి 25న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బోయ పాండుకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతా ఉండటంతో, ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించిన ఆయన కుటుంబ సభ్యులకు బీమా మొత్తం రూ.కోటి 31 లక్షల చెక్కును డిజిపి అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా డిజిఎం కె. మురళీకృష్ణ, సలహాదారు రిటైర్డ్ బ్రిగేడియర్ ఎస్.కె. ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





