స్ఫూర్తిప్ర‌దాత చుక్కా రామ‌య్య‌

– జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ కోచింగ్‌ వ్యవస్థకు మార్గదర్శి అయిన చుక్కా రామయ్యకు మాజీ మంత్రి కేటీఆర్‌ 100వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యానగర్‌లోని నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థుల భవితను తీర్చిదిద్దిన వ్యక్తి రామయ్య అని కొనియాడారు. ఐఐటీ అనగానే గుర్తుకొచ్చే తొలి పేరు, విద్య అంటే గుర్తుకొచ్చే మార్గదర్శి, సేవ అంటే గుర్తుకొచ్చే స్ఫూర్తి అంతా చుక్కా రామయ్య అని పేర్కొన్నారు. వేలాదిమంది విద్యార్థులను ఐఐటి వంటి ఉన్నత విద్యా సంస్థలకు పంపి దేశానికి అద్భుతమైన సేవ చేసిన ఆయన గొప్ప విద్యావేత్త అని అన్నారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు అపారమైనవని, ఉన్నతమైన విద్యను గ్రామీణ విద్యార్థులకు చేరవేసిన గొప్ప కృషికి ఆయన నిలువెత్తు సాక్ష్యమని కేటీఆర్‌ ప్రశంసించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి పూర్తి చేసి ప్రపంచ దేశాల్లో అనేకమంది స్థిరపడడానికి కారణం చుక్కా రామయ్య అని తెలిపారు. విద్యా ప్రదాతే కాకుండా తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తన పాత్ర పోషించారన్నారు. ఆయన 100వ జన్మదినం జరుపుకోవడం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని కేటీఆర్‌ అన్నారు. రామయ్య ఆరోగ్యంతో సుదీర్ఘకాలం జీవించాలని ఆయన ఆకాంక్షించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, ముఠా గోపాల్‌లు కూడా రామయ్యను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page