బ‌న‌క‌చ‌ర్ల‌తో తెలంగాణ‌కు అన్యాయం

– నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

బనకచర్ల తో తెలంగాణ కు అన్యాయం జరుగుతోంద‌ని నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అన్నారు. జిఆర్ ఎంబీ,  సీడ‌బ్ల్యుసి, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు, అంతర్రాష్ట్ర జలవిధానానికి బనకచర్ల విరుద్దమన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించద‌ని స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం ఆయ‌న హైద‌రాబాద్‌లో విలేక‌ర్ల‌తో మాట్లాడారు.  ఈ ప్రాజెక్టుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ  కేంద్ర మంత్ర‌లు నిర్మ‌లా సీతారామన్ కు,  శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ వ్రాసామ‌న్నారు.  త‌మ‌కు ఏపీ నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామని, చ‌ట్ట‌ప్ర‌కారం ముందుకెళ‌తామ‌ని  గ‌త మేనెల‌లో పాటిల్ తెలంగాణ‌కు స‌మాధాన‌మిచ్చార‌న్నారు. అయితే ఏపీ ఉల్లంఘనలను పూర్తిగా లేఖల్లో తామే సవివరంగా వివరించామ‌న్నారు. కేంద్రం చట్ట విరుద్ధంగా ఏపీకి సహకరిస్తుందని అనుకోవడం లేదు. తెలంగాణ కు అన్యాయం జరిగితే ఎంత వరకైనా పోరాడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ విష‌యంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి లు కేంద్రాన్ని ఒప్పించాల‌ని కోరారు. కృష్ణాలో అన్యాయం జరుగుతుంటే పదేళ్లు బి ఆర్ ఎస్ సహకరించింది. ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాటా 724 టీఎంసీ ఏపీకి వెళితే,  బి ఆర్ ఏఎస్ హయాంలో 1254 టీఎంసీ లు కృష్ణా నీళ్లు తరలించారు. కాళేశ్వరంలో జరిగిన వృధా ఖర్చును చేయకుంటే.. కృష్ణా ప్రాజెక్టులు అన్ని పూర్తి అయ్యేవని గుర్తుచేశారు. తుమ్మిడి హట్టి దగ్గర కాకుండా..మేడిగడ్డ వద్ద కట్టడం ద్వారా 68 వేల కోట్లు కాళేశ్వరం అదనపు ఖర్చు అయ్యింది. కృష్ణాన‌దీ జ‌లాల విష‌యంలో తెలంగాణకు బీఆర్ ఎస్‌ అన్యాయం చేసింద‌న్నారు. 512 టీఎంసీ ఏపీకి.. తెలంగాణకు 299 టీఎంసీ చాలు అని సంతకం పెట్టింది బి ఆర్ ఎస్ ప్రభుత్వం కదా అని ప్ర‌శ్నించారు.  అప్పుడు మోసం చేసి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారంటూ బీఆర్ ఎస్‌పై విరుచుకుప‌డ్డారు.

ముచ్చుమర్రి ప్రాజెక్ట్ పనులను బీఆర్ ఎస్  ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తెలంగాణ మరణశాసనమ‌న్నారు. ప్రతిరోజూ 3 టీఎంసీ తరలించేందూకు కెసిఆర్ సర్కార్ సహకరించిన మాట వాస్త‌వ‌మ‌న్నారు.  జగన్ తో అలైబాలై చేసుకుని.. కృష్ణా నీటి దోపిడీకి కెసిఆర్ సహకరించారని ఆరోపించారు. పదేళ్లలో కెసిఆర్,హరీష్ లు ఎపికోసమే పనిచేసారు.. కృష్ణాలో నీటి ని త‌ర‌లించారు.

ఉమ్మడి ఏపీకంటే ముచ్చుమర్రి,మల్యాలలో పదేళ్ల కెసిఆర్ హయాంలో ఎక్కువగా తరలించుకు పోయార‌న్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ టెండర్లు పూర్తి అయ్యేవరకు, తెలంగాణ కావాలనే అపెక్స్ కౌన్సిల్ కు వెళ్ళలేదు. జగన్-కెసిఆర్ రహస్యం ఒప్పందం లో భాగంగానే, తెలంగాణ అపెక్స్ మీటింగ్ వెళ్ళలేదు. బనకచర్ల పై బీ ఆరెస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నార‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *