జీవో 252తో జర్నలిస్టులకు అన్యాయం

– మంత్రి పొంగులేటిని కలిసిన యూనియన్‌ ‌నేతలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: అ‌క్రిడిటేషన్‌ల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీ.ఓ.252తో తమకు అన్యాయం జరుగుతుందని డెస్క్ ‌జర్నలిస్టులు గడిచిన వారం రోజులుగా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో డెస్క్ ‌జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతూ.. టీడబ్ల్యూజేఎఫ్‌, ‌డీజేఎప్టీ నేతలు మంగళవారం సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డిని కలిశారు. డెస్క్ ‌జర్నలిస్టులకు గతంలోలాగే అక్రిడిటేషన్‌ ‌కార్డులు ఇవ్వాలని, జీ.ఓ. 252ని సవరించాలని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. స్పోర్ట్స్, ‌కల్చరల్‌, ‌ఫీచర్‌ ‌ప్రతినిధులకు అక్రిడిటేషన్‌ ‌కార్డులు ఇవ్వాలని ఫెడరేషన్‌ ‌నేతలు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టు సంఘాల వినతిపై మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రిపోర్టర్లతోపాటు డెస్క్ ‌జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు ఉంటాయని, డెస్క్ ‌జర్నలిస్టులు ఎలాంటి అపోహలు పడొద్దని ఆయన చెప్పినట్లు తెలిసింది. త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తానని చెప్పినట్లు సమాచారం. జర్నలిస్టులకు ఇబ్బంది లేకుండా జీ.ఓ.252ను సవరిస్తామని మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *