జాతరలో అమానుష ఘటన

– చర్యలు తీసుకోవాలని డీజీపీకి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌ఫిర్యాదు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: కుమ్మేరా జాతరలో అమానుష ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌డీజీపీకి ఫిర్యాదు చేశారు.  హైదరాబాద్‌లో కార్యాలయానికి సోమవారం వెళ్లి డీజీపీ శివధర్‌ ‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అ‌గ్రకులానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు రజక కులానికి చెందిన రెండు నెలల పసికందును తన్ని చంపిన ఘ‌ట‌న‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికితీయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట బీసీ కమిషన్‌ ‌మాజీ సభ్యులు కిషోర్‌ ‌గౌడ్‌, ఉపేందర్‌ చారి, కార్పొరేషన్‌ ‌మాజీ చైర్మన్‌ ‌బాలరాజు యాదవ్‌, ‌నేతలు స్వామి యాదవ్‌,‌ రాజు తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *