దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలకు పెద్దపీట

-ఏకంగా రూ. 8.8 లక్షల కోట్లతో ఆరు భారీ ప్రాజెక్టులు
-జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ ‌పొడింపునకు మరో రూ.8.7 లక్షల కోట్ల
-అంతర్జాతీయ విమానాశ్రయంగా మధురై ఎయిర్‌పోర్టు
-రూ.2,905 కోట్లతో సంత్రాగచ్చి-ఖరగ్‌పూర్‌ ‌ఫోర్‌లేన్‌ ‌రోడ్డు
-రూ.3,839 కోట్లతో బద్నావర్‌-‌థాండియా-తిమర్వానీ మధ్య 5 లైన్ల రహదారి
-రూ.3,631 కోట్లతో జెవార్‌ ‌విమానాశ్రయం-ఫరీదాబాద్‌ ‌మధ్య 6 లైన్ల ఎలివేటెడ్‌ ‌రోడ్డు
-కేంద్ర కేబినెట్‌ ‌వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

‌న్యూదిల్లీ, మార్చి 10 : ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ ‌పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ ఏకంగా రూ. 8.8 లక్షల కోట్ల విలువైన ఆరు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇక జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ ‌పొడింపు కోసం మరో రూ.8.7 లక్షల కోట్లను కేటాయించింది. ముధురై ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించేందుకు కేంద్ర కేబినెట్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇక సంత్రాగచ్చి-ఖరగ్‌పూర్‌ ‌మద్య రూ.2,905 కోట్లతో నాలుగు లైన్ల రహదారి, రూ.3,839 కోట్లతో బద్నావర్‌-‌థాండియా-తిమర్వానీ మధ్య 5 లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.3,631 కోట్లతో జెవార్‌ ‌విమానాశ్రయం-ఫరీదాబాద్‌ ‌సెక్షన్‌ను కలిపే 6 లైన్ల ఎలివేటెడ్‌ ‌రోడ్డు నిర్మాణానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే కాకుండా, సామాన్యుల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచనున్నాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ ‌వివరాలను డియాకు వెల్లడిస్తూ, ప్రభుత్వం చేపడుతున్న ఈ సంస్కరణలు భవిష్యత్‌ ‌భారత్‌ ‌నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేబినెట్‌ ‌భేటీలో అత్యంత కీలకమైన నిర్ణయం ’జల జీవన్‌ ‌మిషన్‌ 2.0’ ‌ప్రారంభం. దీని కోసం ప్రభుత్వం సుమారు రూ. 8.7 లక్షల కోట్లను కేటాయించింది. 2019లో ప్రారంభమైన మొదటి దశలో ఇప్పటికే 81 శాతం గ్రాణ గృహాలకు కుళాయి కనెక్షన్లు అందగా, ఇప్పుడు రెండో దశ ద్వారా మిగిలిన ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కాకుండా, మౌలిక సదుపాయాల బలోపేతంపై దృష్టి సారించనున్నారు. అదనంగా లక్షల కోట్ల రూపాయల కేంద్ర సాయాన్ని పెంచడం ద్వారా గ్రాణ ప్రాంతాల్లో నీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. తమిళనాడులోని ఆధ్యాత్మిక, చారిత్రక నగరమైన మధురైకి కేంద్రం అంతర్జాతీయ స్థాయి గుర్తింపునిచ్చింది. మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం దక్షిణ తమిళనాడు అభివృద్ధికి సరికొత్త రెక్కలు తొడిగింది. దీనివల్ల నాక్షి అమ్మన్‌ ఆలయం, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా, మధురై చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక, విద్యా , వైద్య హబ్‌లకు అంతర్జాతీయ స్థాయి అనుసంధానం లభించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. దేశవ్యాప్తంగా రైళ్ల రద్దీని తగ్గించి, రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు రూ. 4,474 కోట్ల వ్యయంతో రెండు ప్రధాన రైల్వే ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. పశ్చిమ బెంగాల్‌, ‌జార్ఖండ్‌ ‌రాష్ట్రాల్లోని సాయింతియా-పాకూర్‌ , ‌సంత్రాగచి-ఖరగ్‌పూర్‌ ‌విభాగాల్లో నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ‌లభించింది. ఈ అదనపు లైన్ల వల్ల కేవలం ప్రయాణికులకు మాత్రమే కాకుండా, బొగ్గు, ఇతర సరుకు రవాణా కూడా వేగవంతం కానుంది. ఇది భారతీయ రైల్వేల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంలో ఒక మైలురాయిగా నిలవనుంది. రవాణా రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో మధ్యప్రదేశ్‌లో కొత్తగా ఫోర్‌ ‌లేన్‌ ‌కారిడార్‌ ‌నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎన్‌హెచ్‌-752‌డి పరిధిలో బద్నావర్‌ ‌నుండి తిమర్వానీ వరకు 80 కిలోటర్ల మేర నిర్మించబోయే ఈ రహదారి ఉజ్జయిని నగరాన్ని దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేతో నేరుగా అనుసంధానిస్తుంది. దీనితో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌ ‌విమానాశ్రయాన్ని ఫరీదాబాద్‌తో కలిపే ఎలివేటెడ్‌ ‌రోడ్డు ప్రాజెక్టును కూడా ఆమోదించారు. ఈ నిర్ణయాలన్నీ కలిపి దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాక ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తాయని అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *