– అధికారులకు బీసీ కమిషన్ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: వివిధ విద్యాసంస్థల్లోని విద్యార్థుల సమాచారాన్ని కులాల వారీగా సేకరించడంలో జాప్యం జరుగుతున్నందున ఈ విషయం ప్రాధాన్యతను గుర్తించి సమాచారం సేకరించి బీసీ కమిషన్‌కు అందించాలని కమిషన్ చైర్మన్ నిరంజన్ అధికారులను ఆదేశించారు. ఈ సమాచారం ఆధారంగా బీసీ విద్యార్థుల్లో ఏ కులానికి, ఏ వర్గానికి చెందిన వారు విద్యకు దూరంగా ఉంటున్నారో గుర్తించి వారిని ప్రోత్సహించే అవకాశం కలుగుతుందన్నారు. ఈమేరకు కమిషన్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమావేశం జరిగింది. వెంటనే ఈ సమాచారాన్ని సేకరించే కార్యక్రమానికి స్వీకారం చుట్టి మార్చి లోపల వివరాలు అందిస్తామని అధికారులు చెప్పారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండే అడ్మిషన్స్‌లోనూ, రాబోయే విద్యా సంవత్సరం నుండి జరిగే ప్రవేశ పరీక్షలలోను కుల సంబంధిత సమాచారాన్ని సేకరించబోతున్నామని తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్, కాళోజి నారాయణరావు యూనివర్సిటి ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిజిస్ట్రార్ డాక్టర్ కె.నాగార్జున రెడ్డి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి కృష్ణ ఆదిత్యలతో బీసీ కమిషన్ చైైర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్క్ష్మి, మెంబర్ సెక్రెటరి బాల మాయాదేవి సవివరంగా చర్చించారు. సమావేశంలో డిప్యూటి డైరెక్టర్ యు.శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కె.మనోహర్ రావు, ప్రత్యేక అధికారి కుమారి ఎన్.సునీత, సెక్షన్ ఆఫీసర్ జి.సతీష్ కుమార్, రీసెర్చ్ ఆఫీసర్ జి.లక్ష్మీనారాయణ, తదితర అధికారులు కూడా పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





