ఇండో-అమెరికా ఒప్పందాన్ని రద్దు చేయాలి

– యూత్ కాంగ్రెస్ నిరసనలో మంత్రి సీతక్క

దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 14: ఇండో-అమెరికా ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ దిల్లీలోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన నిరసన దీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే ఏ ఒప్పందాన్నైనా పునఃపరిశీలించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. దేశ స్వావలంబన, రైతులు, కార్మికులు, సాధారణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశ ప్రయోజనాలు, ప్రజల హక్కులు కాపాడే విషయంలో యువత ముందుండి పోరాడటం అభినందనీయమని మంత్రి సీతక్క కొనియాడారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి హక్కు అన్నారు. ఈ నిరసనలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బి.వి.చిబ్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *