ఇందిర‌మ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగ‌వంతం చేయాలి

బేస్‌మెంట్ పూర్త‌యిన ఇళ్లకు త‌క్ష‌ణ‌మే చెల్లింపులు
ఏ గ్రామంలోనూ తాగునీటి స‌మ‌స్య రావొద్దు
జూన్ చివ‌రి నాటికి వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ పూర్తికావాలి
మ‌డికొండ డంపింగ్ యార్డుకు శాశ్వ‌త ప‌రిష్కారం
రెవెన్యూహౌసింగ్‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్ప్రజాతంత్రమార్చి 28 : పైల‌ట్ గ్రామాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌నిబేస్‌మెంట్ పూర్త‌యిన ఇళ్లకు త‌క్ష‌ణం చెల్లింపులు జ‌ర‌పాల‌ని వ‌రంగ‌ల్ జిల్లా ఇన్ ఛార్జిరాష్ట్ర రెవెన్యూహౌసింగ్‌స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలో వ‌రంగ‌ల్ స్మార్ట్ సిటీ ప‌నులువ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌తాగునీరుఇందిర‌మ్మ ఇండ్లు త‌దిత‌ర అంశాల‌పై పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌అట‌వీదేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేందర్ రెడ్డితో క‌లిసి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఎమ్మెల్యేలుక‌లెక్ట‌ర్లుఅధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం ఈ ప్ర‌భుత్వానికి అత్యంత ప్రాధాన్య‌తా అంశ‌మ‌ని దీనిని దృష్టిలో పెట్టుకొని క‌లెక్ట‌ర్లు ప‌నిచేయాలని సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల ల‌బ్దిదారుల‌కు ప్ర‌భుత్వం నాలుగు విడ‌త‌ల‌లో చెల్లింపులు చేస్తుంద‌నిమొద‌టి విడ‌త‌లో బేస్ మెంట్ లెవెల్ పూర్త‌యిన ఇండ్ల‌కు రూ.ల‌క్ష ఇస్తుంద‌నిబేస్ మెంట్ పూర్త‌యిన ఇండ్ల వివ‌రాల‌ను హౌసింగ్ విభాగానికి పంపిస్తే త‌క్ష‌ణ‌మే చెల్లింపులు చేస్తామ‌ని తెలిపారు. ఇందిర‌మ్మ ఇండ్ల స‌ర్వేలో ఇండ్ల స్ధ‌లాలు లేని అర్హ‌త క‌లిగిన ల‌బ్దిదారుల‌కు ఇప్ప‌టివ‌ర‌కు కేటాయించ‌ని 2 బిహెచ్‌కే ఇండ్ల‌ను కేటాయించాల‌ని అలాగే మొండి గోడ‌ల‌తో ఉన్న ఇండ్ల‌ను పూర్తిచేయ‌డానికి కాంట్రాక్ట‌ర్ ముందుకు రాని ప‌క్షంలో ల‌బ్దిదారులే ఆ ఇండ్ల‌ను పూర్తిచేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన ఆర్ధిక స‌హాయాన్ని ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంద‌ని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేసి ఇండ్ల‌ను కేటాయించాల‌ని సూచించారు.

వేస‌వి కాలంలో ఏ గ్రామంలో ప‌ట్ట‌ణంలోగానీ తాగునీటి స‌మ‌స్య రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి. ప్ర‌ధానంగా జిల్లా క‌లెక్ట‌ర్లు ఈ అంశానికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని జిల్లా అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని అధికారులు వారంలో మూడు రోజులు గ్రామాల్లో ప‌ర్య‌టించాల‌ని సూచించారు. వ‌చ్చే మూడు నెల‌లు చాలా కీల‌క‌మ‌ని ప్ర‌జ‌ల‌కు ఎక్క‌గా తాగునీటి గురించి ఇబ్బంది క‌ల‌గ‌కుండా నీళ్లు రావ‌డం లేద‌న్న విమ‌ర్శ రాకుండా ప‌నిచేయాల‌న్నారు. నీటికొర‌త ఉన్న ప్రాంతాల‌లో ట్యాంక‌ర్ల ద్వారా తాగునీరు స‌ర‌ఫ‌రా చేయ‌డంచెడిపోయిన బోర్లుహ్యాండ్ పంప్ ల‌ను త‌క్ష‌ణం మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాలని సూచించారు.

వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌ను రెండు నెల‌ల్లో పూర్తిచేసి ఆ త‌ర్వాత మ‌రో నెల‌రోజుల్లో వైద్య సేవ‌ల‌కు అవ‌స‌ర‌మైన ప‌రికరాల‌ను అమ‌ర్చి జూన్ చివ‌రి నాటికి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. ఈ దవాఖాన  అందుబాటులోకి వొస్తే ఉత్త‌ర తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అత్యాధునిక వైద్య సేవ‌లు అందుబాటులోకి వొస్తాయ‌న్నారు. మ‌డికొండ డంపింగ్ యార్డు స‌మ‌స్య‌కు వారం రోజుల్లో తాత్కాలిక ప‌రిష్కారం చూపించి ఆ తర్వాత శాశ్వ‌త ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. దీనికి సంబంధించి సిడిఎంఎ డైరెక్ట‌ర్ శ్రీ‌దేవిని స్వ‌యంగా అక్క‌డ ప‌ర్య‌టించి ప‌రిష్కార మార్గాల‌ను సూచించాల‌ని ఆదేశించారు.

వ‌రంగ‌ల్క‌రీంన‌గ‌ర్ ర‌హ‌దారి ప్రాంతంలో శాశ్వ‌త డంపింగ్ యార్డు కోసం 150 నుంచి 200 ఎక‌రాల భూమిని సేక‌రించాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి చెరువు పూడిక‌తీత ప‌నుల‌ను ఎట్టిప‌రిస్దితుల‌లోను వ‌ర్షాకాలం ప్రారంభ‌మ‌య్యేలోపు పూర్తిచేయాల‌న్నారు. వ‌రంగ‌ల్ స్మార్ట్ సిటీ ప‌నుల విష‌యంలో అధికారులు ప్ర‌ణాళికా బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్యేలు క‌డియం శ్రీహ‌రినాయ‌ని రాజేందర్‌య‌శ‌స్విని రెడ్డిదొంతి మాధ‌వ‌రెడ్డినాగ‌రాజుముర‌ళీనాయ‌క్‌రామ‌చంద్ర నాయ‌క్‌రేవూరి ప్ర‌కాష్‌రెడ్డిగండ్ర స‌త్య‌నారాయ‌ణ‌ఎమ్మెల్సీ బ‌స‌వ‌రాజు సార‌య్య‌మేయ‌ర్ గుండు సుధారాణిమున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి దాన‌కిశోర్‌ఆర్ అండ్ బి సెక్రెట‌రీ హ‌రిచంద‌నకుటుంబ సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *