అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇల్లు

– దంతన్‌పల్లిలో వైభవంగా గృహప్రవేశం
– నూతన గృహాన్ని ప్రారంభించిన భట్టి, అడ్లూరి

ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీì ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఉట్నూర్ మండల పరిధిలోని దంతన్‌పల్లి గ్రామానికి చెందిన లింగంపెల్లి తారమ్మ నూతనంగా నిర్మించుకున్న గృహ ప్రవేశ మహోత్సవం(ఇందిరమ్మ ఇల్లు) వైభవంగా జరిగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా నూతన గృహాన్ని ప్రారంభించి తారమ్మకు పట్టు చీర అందించి సత్కరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ 2023 పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు తారమ్మ లాంటి అనేకమంది తల్లులు దశాబ్దాలుగా ఇంటి కోసం అడిగి అడిగి అలిసిపోయామని విన్నవించారు. వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే.. తమ ప్రభుత్వం రాగానే రూ.5 లక్షలతో అర్హులైన ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశాం.. ఆ హామీ మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించామని తెలిపారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఇప్పటివరకు జిల్లాకు రూ.150 కోట్లT మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు గ్రామస్తులు డప్పు వాయిద్యాలు, పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని అంబేడŠ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తారమ్మతోపాటు వారి కుటుంబ సభ్యులకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉప ముఖ్యమంత్రికి అంబేద్కర్ చిత్రపటాన్ని అందించి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *