– మాజీ మంత్రి ఎర్రబెల్లి
వరంగల్,ప్రజాతంత్ర,డిసెంబర్10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీలో, మహిళా సంఘాల పేరుతో తీసుకున్న రూ.450 కోట్ల రుణంలో కషన్లకు కక్కుర్తి పడి అతి పెద్ద కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బొజ్జన్నపేట గ్రామంలో నిర్వహించిన సర్పంచి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హాలతో ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వొచ్చిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ హాల అమలులో విఫలమయ్యారని చెప్పారు. ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ పేరుతో ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన బిడ్డల హక్కులను కాలరాసే ప్రయత్నం చేసిందన్నారు. రైతు బంధు, భరోసా పథకం అమలు చేసి రైతులకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భారత రాష్ట్ర సమితి సర్పంచి అభ్యర్థి ప్లలెల పావనిని అత్యధిక మోజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బియ్యాల నళినీదేవి, మాజీ సర్పంచి ఫీర్నాకి రజిత, మాజీ ఎంపీటీసీ సభ్యుడు అనిల్, సోమేశ్వర్ రావు, ధీరజ్ రావు, పలువురు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.