– రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 13: యాదగిరిగుట్ట పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇంటిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం యాదగిరిగుట్టలో అధికారులు స్థానికులతో కలసి మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నిరోధంపై ప్రతిజ్ఞ చేశారు. మాధకద్రవ్యాల వల్ల యువత చెడు దారులు పడుతున్నారని, వాటిని నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ గణేష్. ఎంపీడీవో నవీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.


