అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

– నగరంలో అర్హుల జాబితా తయారీ
– అసంపూర్తి 2బిహెచ్‌కె ఇళ్ల పూర్తి
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18:హైదరాబాద్‌ ‌జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్ లో  రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్‌ అజారుద్దీన్‌, ‌రాజ్యసభ సభ్యులు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌,  ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక, రెండు పడకల గదుల ఇండ్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ  ప్రభుత్వం పేదల ఇళ్ల మంజూరులో పారదర్శకతగా వ్యవహరిస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి అందించటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎల్‌ ‌వన్‌  ‌కింద 4800  మంది అర్హులైన ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు రెండు పడకల గదుల ఇల్లు నిర్మించ‌డానికి నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అలాగే  ఎల్‌ ‌టు  (ఒ2) కింద హైదరాబాద్‌ ‌జిల్లాలో నాలుగు లక్షల ఇరవై రెండు వేలకు పైగా దరఖాస్తులు వివిధ నియోజకవర్గాల నుండి పేద ప్రజలు అందజేశారని  మంత్రి వివరించారు. హైదరాబాద్‌ ‌మహానగరంలో స్థలాలు  సేకరించి జీ ప్లస్‌ 5-10  ‌వరకు ఇందిరమ్మ ఇల్లు చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వివరించారు.. పెండింగ్‌ ‌లో ఉన్న 2 బిహెచ్‌కె ఇళ్ల పనులు పూర్తి చేసి అర్హులకు అందించాలని అధికారులకు సూచించారు.ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి.. లబ్దిదారులు ఎంత మంది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 2 బిహెచ్‌కె లబ్దిదారులకు అందించమని ఇంకా  పెండింగ్‌ ‌పనులు పూర్తి  చేసి లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్‌ ‌కాలనీలు,  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్ధలాల సేకరణ,అసంపూర్తిగా ఉన్న డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి, పూర్తయిన ఇండ్ల  కేటాయింపు తదితర అంశాలపై శాసనసభ్యులతో కలిసి మంత్రులు సమీక్షించారు. తదుపరి హైదరాబాద్‌ ‌జిల్లా  పరిధిలోని  నియోజకవర్గాల శాసనసభ్యుల అభిప్రాయాలను ఈ సందర్భంగా స్వీకరించి చేపట్టే అంశాలపై  చర్చించారు.  ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఆర్‌ ‌వి కర్ణన్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌హరిచందన దాసరి, పిడి హౌసింగ్‌ అశోక్‌ ‌చక్రవర్తి,  ఆర్డీవోలు రామకృష్ణ, సాయిరాం హౌసింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *