ఇందిరమ్మ ఇల్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక

– గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి 

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: ఇం‌దిరమ్మ ఇల్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని తెలంగాణ గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రెహమత్‌ ‌నగర్‌లో పర్యటించిన మంత్రి.. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించలేక పోయిందని ఆరోపించారు. తమ అభ్యర్థి నవీన్‌కుమార్‌ను గెలిపిస్తే.. మూడేళ్ల కాలంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. బీజేపీ, భారత రాష్ట్ర సమితిలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *