– ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణలో వైఫల్యం
– రూ.5కే భోజనం.. కానీ నాసిరకం
– ఎక్కువగా తినేది నిరుపేదలు, వలస కూలీలే
– అధికారుల పర్యవేక్షణ లేక నీరుగారుతున్న పథకం
– పీపుల్స్ పల్స్ సమగ్ర సర్వేలో బహిర్గతమైన లోపాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాజధాని నగరంలో ప్రభుత్వం నిరుపేదలకు రూ.5లకే టిఫిన్, భోజనం అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్ల పనితీరుపై నెల రోజు లపాటు సమగ్ర సర్వేసు పీపుల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్, సమాచార హక్కు మాజీ కమిషనర్ ఆర్.దిలీప్ రెడ్డి మార్గదర్శకత్వంలో సర్వే నిర్వహించి షాకింగ్ నిజా లు వెలుగులోకి తెచ్చారు. అన్ని స్థాయిల్లో శ్రద్ధాసక్తులు లోపించడం. ఆహారం విషయంలో రుచి, నాణ్యత, పోషక విలువలు ఏవీ పట్టించుకోకపోవడం, శుచి శుభ్రత సమ యపాలన వంటివి గాలికి వదిలేయడం, భయంకరమైన నిర్వహణ వైఫల్యం, నిఘా- తనిఖీలు మందగించడం.. వెరసి ఇదొక దండుగమారి వ్యవహారంగా తయా రయిందని సర్వే స్పష్టం చేసింది. ఇక్కడ భోజ సం చేసేవారిలో అత్యధికులు, పేదలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలు, ఆటో డ్రైవర్లు, చాలా తక్కువ సంఖ్యలో విద్యా ర్థులు, మహిళలు వుంటున్నారు. వీటిని ప్రారంభించిన ఉద్దేశం మంచిదే అయినా నిర్వహణలోపం, అశ్రద్ధ, పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఇదొక పనికిమాలిన పథకంగా మారింది. నామమాత్రపు ఖర్చు, అయిదు రూపాయలకే ఓ పూట భోజనం పెట్టి కడు నిరుపేదల కడుపు నింపేందుకు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు. చేసింది. మొదట ఎనిమిది సెంటర్లతో మొదలైనా ఇప్పుడు పేరు మారి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరిట జిహెచ్ఎంసి పరిధిలో, జంటనగరాల శివార్లలో కలిపి ఆ సెంటర్ల సంఖ్య 150కి చేరింది. మధ్యాహ్నం అందించే భోజనానికి తోడు ఉదయం రూ.5లకే టిఫిన్ (కొన్నిచోట్ల) అందించే సౌకర్యాన్ని ఇటీవల రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం వీటిల్లో పరిమితంగా కొన్నిచోట్ల (ముఖ్యంగా హాస్పిటల్స్ వద్ద) రాత్రిపూట భోజనం కూడా పెడుతున్నారు.
తినేవాళ్లు సరిపెట్టుకుంటున్నారు
ఈ సర్వేలో తేలిన అతి ముఖ్యమైన అంశమేంటంటే తినేవారు తాము చెల్లించే రూ.5 కు ఇంతకు మించిన భోజనం ఏం దొరుకుతుందిలే అని సర్దుకుపోవడం. తినేవాళ్లు తమ జేబు నుంచి రూ.5 ఇస్తుంటే దానికి ప్రభుత్వం మరో రూ.24.83 సబ్సిడీ చెల్లిస్తోంది. టిఫిన్ విషయంలోనూ అంతే. తినేవాళ్లు రూ.5 చెల్లిస్తుంటే ప్రభుత్వం దానికి మరో రూ.14 సబ్సిడీగా చెల్లిస్తోంది. అంటే భోజనానికి రూ.29.83, టిఫిన్ కి రూ.19 వ్యయమవుతున్నట్టు లెక్క. ఇవేవీ దాదాపు 80% మందికి తెలియదు. దీనికితోడు శుచి, శుభ్రత లేకపోవడం ఆహారం విషయంలో రుచి, నాణ్యత, పోషక విలువలు ఏవీ పట్టించుకోకపోవడం మరీ దారుణం. భోజనం లో అన్నంతో పాటు ఒక కర్రి, సాంబారు /సం గానీ, పప్పు సాంబారుIరసం గానీ ఇవ్వా లి. అడిగిన వారికి ఏదో ఒక చట్నీ ఇవ్వాలి. అది కూడా చాలాసార్లు ‘అయిపోయింది’ అనే చెబుతారు. నీళ్ల కోసం ఆర్వో సెంటర్లు ఏర్పా టు చేసినా అవి ప్రారంభించకపోవడంతో నీళ్ల ప్యాకెట్లే కొనసాగుతున్నాయి. అవి కూడా సరిగా ఉండవు. పగిలిన ప్యాకెట్లు కూడా వస్తాయి, మరోమారు నీరు వాసన వస్తుంటుంది. నీళ్లు బాగోవు, సరిపడా ఇవ్వరని 79 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. అన్నం ముద్దలాగా ఉంటోందని, మంచి బియ్యం వాడట్లేదనే ఆరోపణ ఉంది. అనేకచోట్ల సన్న బియ్యాన్ని ప్రభుత్వం జీహెచ్ ఎంసీకు అందించి ఆ బియ్యంతో అన్నం వండించి పంపిణీ చేయాలని కూడా అదిక శాతంమంది అభిప్రాయం. కర్రీ, సాంబర్ కూడా నీళ్లలాగా పలుచగా ఉంటోందని, ఒకో సారి రెండూ ఒక్కలాగే ఉండటమో కలిపి అన్నంలో పోయడమో చేస్తున్నారని తినే వారంటున్నారు. దానికి బదులు సాంబారు రైస్, కర్టిరైస్, పులిహోరా, టామోటా రైస్, పుదీనా రైస్, జీరారైస్, వెజిటబుల్ బిర్యానీ.. ఇలా ఏదో ఒకటిచ్చినా బాగుండు అని అత్యధికులు అంటున్నారు. అలా ‘ప్రత్యేక అన్నం ఒకటే ఇచి దాని అంచుకు చట్నీ ఇస్తే చాలన్నది వారి అభిప్రాయం. శుభ్రత, నాణ్యత మెజారిటీ ఇందిరమ్మ క్యాంటీన్లు పరిశుభ్రతకు ఆమడ దూరం. కాస్తోకూస్తో పారిశుధ్ధ్యం ఉన్న క్యాంటీన్లు నాలుగోవంతు కూడా ఉండవేమో! వడ్డించే వారే తప్ప ఒకరు తినిపోయిన తర్వాత ఆ పరిసరాల్ని శుభ్రపరిచే సిబ్బంది లేరు. కూర్చొని తినే వ్యవస్థ (దాతలు వ్యవస్థ సమ కూర్చిన ‘హైటెక్ సిటీ’ వంటి ఒకటి, రెండు చో ట్ల తప్ప ఎక్కడా లేదు. జీహెచ్ఎంసి స్థానిక పారిశుద్ధ్య సిబ్బంది దయతలిస్తే మూడు, నా లుగు రోజులకొకసారే క్లీనింగ్! కంటెయినర్ లో ఏర్పరచిన ఆర్వో వాటర్ పాయింట్లు పని చేయవు, ఫ్యాన్లు, లైట్లు పనిచేయకపోయినా బాగు చేసే వ్యవస్థ లేదు. కొన్ని చోట్ల కంటెయి సర్లు వచ్చి ఉన్నా, వాటిని వాడకుండా పాత డ బ్బాలలోనే సెంటర్ నిర్వహిస్తున్నారు. క్యాంటీ న్కు ఆనుకొనే చెత్త డంప్లు, అతి సమీ పం. లోనే పబ్లిక్ యూరినల్స్ (అనాథరైజ్డ్) ఉన్నా. ‘ కోవిడ్ తర్వాత జనాల్లో ఆరోగ్య విష యంలో అవగాహన పెరిగింది. ఆహారం, పం పిణీ, ప్రాంగణం, పరిసరాలు…. వీటన్నింటిలో నూ పరిశుభ్రత లోపించడం వల్ల తెలిసినవారు కూడా అటు వెల్లడానికి ఇష్టం చూపటం లేదు. శుచి-శుభ్రత పాటింపు ఘోరం. యూనిఫామ్ నిబంధన లేకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చిన ట్టు వారుంటున్నారు. బట్టలు సరిగా ఉండవు, స్నానాలయి నా చేస్తారో చేయరో? వాసన వస్తుంటుంది. ఆహారం పెట్టేప్పుడు నిమిషాలు కూడా వారి పక్కన నిలువలేకపోతున్నామని చాలామంది ఆరోపించినట్లు సర్వే పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పటివరకు ‘పాన్షాప్’ సమూనాలో ఉండే డబ్బాల ద్వారా జరుగుతున్న క్యాంటీన్ల నిర్వహణను ‘కంటె యినర్’లకు మార్చింది. కంటెయినర్లలో ఆహారం డిప్లు, ప్లేట్లు పెట్టుకోవడానికి బేస్, హ్యాండ్ వాష్ బేసిన్, ఆర్వో వాటర్ పాయింట్, ఫ్యాన్లు-లైట్లు తదితర సదుపాయాలను ఏర్పాటు చేసింది. వీటిల్లో ఇవేమీ పనిచేయడం లేదని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. కొన్నిచోట్ల బ్రేక్ ఫాస్ట్-లంచ్ రెండూ ఒకేసారి తెచ్చి సెంటర్లో పెడుతుండటం దారుణం. కొన్నిచోట్ల లంచ్ ముందుగా అందిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ పరిమాణంలో సిబ్బంది ‘చేతివాటం’ కూ డా ఉంటోంది. మూడుకు బదులు రెండే ఇడ్లీలు ఇస్తున్నారని సర్వే వెల్లడించింది. ఉప్మా నీళ్లలా పలుచగా ఉండటంతో తినడం కాకుందా తాగాల్సివస్తోందని కొందరు వినియోగదారులు వాపోయారు. ఇడ్లీలు గట్టిగా రాళ్లలా, చట్నీ పుల్లగా, బోండాం నూనెలో ముంచి తేల్చినట్టు.. ఇలా రకరకాలుగా విమర్శలున్నాయి. అధ్వాన్నమైన ఆహారం అందించడం ఎవరికీ మింగుడు పడటంలేదు.
రూ.20కే రోడ్డు పక్కన బండ్లపై రకరకాల ఐటమ్స్ 
హైదరాబాద్ లో అనేకచోట్ల బండ్ల మీద, టివిఎస్, సైకిళ్లపైన వచ్చి రోడ్డుపక్కన టిఫిన్లు అందించే వారు రక రకాల ఐటమ్స్ రూ.20కే ఇస్తున్న వారు ఎందరో. కానీ ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇచ్చే ఆహారం రుచి మాత్రమే కాదు. ఏ ప్రమాణాలతో చూసినా నాణ్యతే ఉండట్లేదు. భోజనంతో పోల్చి చూస్తే టిఫిన్ కాస్త నయం అనే మాట ఒకటుంది. సర్కారు అధికారిక లెక్కల ప్రకారం చూసినా ఇప్పటివరకు ఈ పథకానికి రూ.253.87 కోట్లు వ్యయమైంది. అన్ని సెంటర్లలో కలిసి రోజూ సగటున 30 వేల మంది లంచ్ చేస్తున్నారని సర్కారు లెక్కలు. తాజా గణాంకాల ప్రకారం ఏటా రూ.40 కోట్లు (సుమారుగా టిఫిన్ కు 13 కోట్లు, లంచ్ కు 27 కోట్లు) ఖర్చవుతోంది. ఇదంతా జీహెచ్ఎంసి భరిస్తున్నా వీటి నిర్వహణ మీద శ్రద్దే లేదు. నిఘా లేదు.. నియంత్రణ లేదు. ఎటువంటి తనిఖీలు కూడా నిర్వహించడం లేదు. సచివాలయానికి, జీహెచ్ ఎంసీకి కూతవేటు దూరంలో ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్ల తనిఖీకి కూడా ఏ ఒక్క అధికారీ వెళ్లకపోవడం దారుణం. మ్యాన్పవర్ సరఫరా చేసే కాంట్రాక్టర్లు సిబ్బంది ఒక్కరీతి జీతాలివ్వకపోవడం, అదీ సకాలంలో ఇవ్వకపోవడం వంటివి వారి పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. ఒక్కొక్కరికి నెలకు అయిదు వేలు, నాలుగు వేలు, మూడు వేల రూపాయలు, కొందరికి అమ్ముడుపోయే టిఫిన్, భోజనం యూనిట్లను బట్టి కమీషన్ రూపంలో ఇవ్వటం.. ఏ లెక్కాపత్రం లేకుండా జరుగుతోంది. ఆ కమిష న్ కూడా 2014 నుంచి స్థిరంగా ఉందని, పెంచనే లేదని వారు వాపోతున్నారు. ఒక్కో క్యాంటీన్కు ఎంత ఫుడ్ వస్తోంది? ఎంతమంది తింటున్నారు? ఎంత మిగులుతోంది? వెనక్కి పంపితే ఆ లెక్కలు-ఖర్చులేంటి? ఎవరు భరిస్తారు? ఎంత తరుగుతో అదనపు ఆహారం అవసరమవుతోంది? వీటికి లెక్కలే లేవు. ఎవరూ లెడ్జర్స్ నిర్వహించరు. అసలు వారిని లెక్కలడిగే నాథుడే లేరు అన్నట్టుంది పరిస్థితి! ఏపీలో ఇటువంటి వ్యవస్థతో ఇక్కడి పరిస్థితుల్ని పోల్చి చేసిన వ్యాఖ్యలు దారుణాల్ని ఎత్తిచూపుతాయి. రెండుచోట్లా తాము తినిచూశామని, ఇక్కడి ఇందిరా క్యాంటీన్ల కన్నా అక్కడి అన్న క్యాంటీన్లు వేయి రెట్లు సయమని వారు వ్యాఖ్యానించారు. క్యాంటీన్ల నిర్వహణ, పరిసరాలు, పరిశుభ్రత, ఆహారం, నాణ్యత.. ఇలా ఏ అంశం పరంగా చూసినా అవి ఎన్నో రేట్లు గొప్పగా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డట్టు సర్వేలో తేలింది. ఈ పరిస్థితులను గమనించినప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్ సబ్సిడీ భోజన పథకాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం వుందని సర్వే స్పష్టం చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





