– మహిళలకు స్వయం ఉపాధి పథకాలు
– పెద్దపల్లిలో వీహబ్ ఏర్పాటుకు కృషి
– ఇందిరాశక్తి సంబురాల సభలో మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి,ప్రజాతంత్ర,జూలై16: మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉండేలా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ఇందిరాశక్తి సంబురాల సభకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎమ్మెల్యే విజయరమణరావుతో కలిసి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పెద్దపల్లి జిల్లాలో మహిళా సంఘాల నుంచి 9 బస్సులను ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నాం. గతంలో కొందరు పెద్దమనుషుల నుంచే ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకునేవారు. విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పనులను మహిళా సంఘాలకే అప్పగించాం. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే అవకాశం కూడా మహిళలకే ఇచ్చాం. పెద్దపల్లిలో వీ హబ్ ఏర్పాటు చేస్తాం. మాజీ సీఎం కేసీఆర్ ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం గురించి మాత్రమే ఆలోచించారు. రాష్ట్ర జలహక్కుల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ మేం రాజీపడేది లేదని శ్రీధర్‌బాబు అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆడబిడ్డలు ఆశీర్వదిస్తేనే ఇల్లు అయినా, ప్రభుత్వం అయినా చల్లగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హాలు నెరవేరుస్తున్నాం. ఏ వ్యాపారమైన మహిళలకే ఇవ్వాలని మంత్రి సీతక్క చెప్పారు. ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా మహిళల పేరు దే ఇవ్వాలంటున్నారు. రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో ఒకేసారి రూ.21వేల కోట్లు వేశాం. రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో 9 రోజుల్లోనే రూ.9వేల కోట్లు వేశాం. తక్కువ ఇబ్బందులు, ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను రైతులు ఎంచుకోవాలని సూచించారు. బీజేపీపై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. తాము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. బీసీల రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని ఫైర్ అయ్యారు. బీసీల సాధికారత కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాలన్నారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా తన శాఖ పరిధిలోని అంశాలపై, ఇతర ప్రభుత్వ పథకాలపై మాట్లాడారు. బడి పిల్లల యూనిఫార్మ్‌ల ద్వారా మహిళ సంఘాలకు 30 కోట్లు ఆదాయం వొచ్చిందని తెలిపారు సీతక్క. తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లను కూడా చేస్తోందన్నారు. అంబానీ లాంటి కోటీశ్వర్లు నడిపే సోలార్ ప్లాంట్లు కూడా మహిళ సంఘాలకు ఇస్తున్నామని వివరించారు.
కోటిమందిని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది





