– ఇందిరాగాంధీకి మంత్రి సీతక్క నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: భూ పంపిణీ కోసం, పేదరిక నిర్మూలనకు, అణగారినవర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ధీశాలి ఇందిరాగాంధీ అని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కొనియాడారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించి మాట్లాడుతూ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి పేదల జీవితాల్లో వెలుగు నింపిన మహా నాయకురాలు ఇందిరమ్మ అంటూ ఆ మహా నాయకురాలి జయంతి సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
తన జీవితాన్ని, ప్రాణాలను దేశం కోసం త్యాగం చేసిన త్యాగశీలి అని అన్నారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలంతా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్న లక్ష్యంతో రేవంతన్న ఇందిరా మహిళా శక్తి విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళలను సంఘటితం చేసేందుకు కోటిమంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్పిస్తున్నారని, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో కోటిమంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం సీఎం నేడు ప్రారంభించారన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కొందరు విమర్శిస్తున్నారంటూ వారికి ఆడబిడ్డలే బుద్ధి చెబుతారని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





