– ఒక్కొక్కరికి రూ.10 వేల గిఫ్ట్ ట్రావెలర్ ఓచర్
న్యూదిల్లీ, డిసెంబర్ 11: కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభంలో ఇరుక్కున్న దేశీయ విమానయాన సంస్థ ఇండిగో పరిస్థితులు ఇప్పుడు దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇండిగో ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో ఇబ్బందిపడిన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారికి పరిహారం కింద రూ.10 వేల విలువైన ట్రావెల్ ఓచర్ అందిస్తామని స్పష్టం చేసింది. ఇండిగో సంస్థకు చెందిన వందలాది విమానాలు ఒక్కసారిగా రద్దవడంతో ఈనెల 3, 4, 5 తేదీలలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలమంది ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగిస్తూ పరిహారం చెల్లించే దిశగా ఇండిగో ముందడుగేసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాలకనుగుణంగా బాధిత ప్రయాణికులకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్టు పేర్కొంది. రద్దయిన విమానాల కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరిన ఇండిగో.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకుంటామంది. కంపెనీ అందించే ఈ ట్రావెల్ ఓచర్ విలువ రూ.10వేల వరకూ ఉండనుంది. రానున్న 12 నెలల్లో తమ సంస్థకు చెందిన ఫ్లైట్స్‌లో ప్రయాణించేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చని ఇండిగో తెలిపింది. అయితే ఏయే ప్రయాణికులకు ఎంత మేర పరిహారం కింద చెల్లిస్తారనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


