– మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యం
న్యూదిల్లీ, మార్చి 20: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం ట్రేడింగ్ ఆరంభంలో రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 93.15 వద్దకు చేరింది. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడం రూపాయి మారకం విలువపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం బ్యారెల్ 100 డాలర్లకు పైనే కొనసాగుతోంది. ముడి చమురు సరఫరాలో అంతరాయాలు సుదీర్ఘకాలంపాటు కొనసాగుతాయన్న భయాలు బ్రెంట్ క్రూడ్ ధరలు పైకి ఎగబాకేలా చేస్తున్నాయి. చమురు ధరలు పెరిగే కొద్దీ డాలర్‌కు డిమాండ్‌కు పెరిగి రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్‌పైనా తీవ్ర ప్రభావం చూపించాయి. గురువారం గ్లోబల్ మార్కెట్స్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడటంతో సూచీలు కుప్పకూలాయి. డాలర్‌పై పెట్టుబడులు పెరగడంతో అమెరికన్ కరెన్సీ మరింత బలపడింది. ఫలితంగా రూపాయి సహా అనేక వర్ధమాన దేశాల కరెన్సీలపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వ్యవస్థాగత మదుపర్లు కూడా భారత్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో రూపాయి విలువపై ఒత్తిడి మరింత పెరిగింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యపరపతి విధానం కూడా ఈ పరిస్థితికి కొంత దోహదపడిందని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేటులో కోత పెట్టేందుకు సంకోచిస్తోంది. దీంతో, పెట్టుబడిదారులకు డాలర్ మరింత ఆకర్షణీయంగా మారి వర్ధమాన మార్కెట్స్ నుంచి నిధులు తరలి పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



